Tristyn Lee Life Story In Telugu: కలలు కంటే సరిపోదు. వాటిని నెరవేర్చుకునే సత్తా పత్తా కూడా ఉండాలి. అయితే మనలో చాలా మంది కలలు కనడం వరకు మాత్రం లోటు లేకుండా చేసేస్తారు. ఆ తర్వాత అసలు విషయానికొచ్చేసరికి ముఖం చాటేస్తారు లేదంటే.. సాకులు వెతుక్కుంటారు. అందుకే అద్భుతాలు చేయడం అందరికీ సాధ్యం కాదు. సాధారణంగా టీనేజ్ యువత సినిమాలు, షికార్లంటూ.. ఇప్పుడుకాకపోతే ఇంకెప్పుడంటూ అడ్డదిడ్డపు సమాధానాలతో పిచ్చెక్కిస్తారు. రొటీన్ కు భిన్నంగా ఈ టీనేజ్ కుర్రాడు కసరత్తులు చేసి కండలు వీర లెవల్లో పెంచేశాడు. ఈ కుర్ర కండల రాయుడి (Teenage Body Builder) వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతోంది. మీరూ ఓ లుక్కేయండి..
అమెరికాకు చెందిన ట్రిస్టిన్ లీ (Tristyn Lee) 15 ఏళ్ల వయసులో ఫుడ్ బాల్ ప్లేయర్ కావాలనుకున్నాడు. ఐతే అతని జీవితంలో చిన్న మలుపు లీని ఫ్రొఫెషనల్ బాడీ బిల్డర్ గా నిలబెట్టింది. అంతేకాదు నేడు ప్రపంచ వ్యాప్తంగా అతనిపేరు మారుమోగిపోతోంది కూడా. తాజాగా లీ 15 నుంచి 19 ఏళ్ల మధ్య అతని శరీరాన్ని ఏ విధంగా ఇనుములా మార్చాడో తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా నెటిజన్లతో పంచుకున్నాడు. వర్క్ ఔట్ చేస్తున్న వీడియో కూడా షేర్ చేశాడు. నిజానికి ట్రిస్టిన్ లీ (Tristyn Lee) పొట్టిగా ఉంటాడు. దీంతో అందరూ అతన్ని ఆటపట్టిస్తూ ఉండేవారు. ఐతే లీ మాత్రం తనను చూసి నవ్విన వారికి గట్టి సమాధానం ఇవ్వాలనుకున్నాడు. ఐదేళ్లు కఠోర శ్రమ పడి బాడీ బిల్డర్ అయ్యాడు. తన బలహీణతను బలంగా మార్చుకున్నాడు. నిజానికి లీ కొన్ని సంవత్సరాల క్రితం పిన్న బాడీబిల్డర్ గా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు కూడా. ప్రస్తుతం లీకి 19 ఏళ్లు. నేడు అతని ఫిట్ నెస్ వీడియోను చూసిన యావత్తు ప్రపంచం ప్రశంసల్లో ముంచెత్తుతోంది. మరి మీరేమంటారు..
Read Also: