బెంగుళూరులో ఆటో డ్రైవర్ల స్మార్ట్ టైమింగ్ గురించి ఓ నెటిజన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా,..ప్రస్తుతం ఆ పోస్ట్ వైరల్‌గా మారింది. ఓ ఆటో డ్రైవర్ రైలు మిస్ చేసుకున్న వ్యక్తిని రైలు కంటే ముందే ఆ తరువాతి స్టేషన్‌కు చేర్చి అందరితో భేష్ అనిపించుకున్నాడు. ఆదిల్ హుస్సేన్ అనే వ్యక్తి ఈ విషయాన్ని సోషల్ మీడియా వేధికగా నెటిజన్లతో షేర్ చేసుకున్నారు. కొన్ని రోజుల క్రితం తాను.. బెంగళూరు నగర్ రైల్వే స్టేషన్ నుండి మధ్యాహ్నం 1.40 గంటలకు బయలుదేరే పశుపతి ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కాల్సి ఉండగా, ఆ రైల్వే స్టేషన్‌కు చాలా దూరంలో ఉండాల్సి వచ్చింది. అక్కడ్నుంచి రైల్వే స్టేషన్‌కు వెళ్లాలంటే..ట్రాఫిక్ ఇబ్బందులు తప్పవని గ్రహించాడు. ఎందుకంటే.. అక్కడి నుండి రైల్వే స్టేషన్‌కి 17 కిలోమీటర్లు ఉంటుంది. కానీ ట్రాఫిక్ కారణంగా తాను రైల్వే స్టేషన్‌కు సమయానికి చేరుకునే అవకాశం చాలా తక్కువ. ఒకవేళ బయల్దేరిన ట్రైన్ దొరికే అవకాశం లేదని భావించాడు..దాంతో 12:50కి మారతహళ్లి నుంచి ఆటోలో ప్రయాణం మొదలుపెట్టాడు.
తను బయల్దేరిన ఆటో రైల్వే స్టేషన్‌కు చేరుకోగానే అందరూ తనను చుట్టుముట్టి వింతగా ప్రశ్నించారని చెప్పాడు. కొంతమంది ఆసక్తిగల ఆటో డ్రైవర్లు తన వద్దకు వచ్చి ఆటోలో ఇంత స్పీడ్‌గా ఎలా వచ్చారంటూ అడగడం ప్రారంభించారు. ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌కి వచ్చావా అని అందరూ అడిగారట. కానీ, అతని అప్పుడు అర్థం కాలేదు..తను మాత్రం My Train యాప్‌లో రైలు కోసం సర్చ్ చేస్తూ.. ప్లాట్‌ఫారమ్‌కి వెళ్లానని చెప్పాడు.
కానీ, దురదృష్టవశాత్తు తాను ప్లాట్‌ఫారమ్‌కు చేరుకునే లోపుగానే రైలు వెళ్లిపోయిందని తెలిసింది. ఒక ఆటో డ్రైవర్ నన్ను రైలు వెళ్లే తదుపరి స్టేషన్‌కు తీసుకువెళతానని మాటిచ్చాడు.. ఆ రైల్వే స్టేషన్ కూడా 27 కి.మీ దూరంలో ఉండటంతో తాను అయోమయంలో పడ్డానని చెప్పాడు. కానీ, ఆటోడ్రైవర్ గట్టి చెప్పాడు.. మిమ్మల్ని పక్క రైల్వే స్టేషన్‌కి (యలహంక రైల్వే స్టేషన్) సమయానికి తీసుకెళ్తేనే డబ్బులు చెల్లించమని అన్నాడు. లేదంటే..ఇవ్వొదని చెప్పాడు. మీరు సమయానికి ట్రైన్ ఎక్కగలిగితే.. ఆటో డ్రైవర్ల ఇద్దరికీ 2500 రూపాయలు ఇవ్వాలని అడిగారని చెప్పాడు.
Had a #peakBengaluru experience some days back.
I was supposed to board Prashanti express at 1:40 pm from SBC station and due to some work commitments I started by 12:50 from Marathalli.
The distance was 17 kms and due to traffic i couldn’t make it on time.
Continued… pic.twitter.com/iUK7bQLcWh
— Adil Husain (@Adil_Husain_) December 5, 2023
ట్రైన్ దొరకలేదంటే.. ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుందామని భావించాను. కానీ, సమయానికి పక్క రైల్వే స్టేషన్‌కు చేరుకుంటామని చెప్పిన ఆటో డ్రైవర్‌ను నమ్మి ఆటో ఎక్కానని చెప్పాడు. ఆటోడ్రైవర్‌ని నమ్మి మళ్లీ తన ప్రయాణాన్ని మొదలుపెట్టానని చెప్పాడు. చెప్పిన మాట ప్రకారం..ఆటో డ్రైవర్ తనను నిర్ణీత సమయంలో రైల్వే స్టేషన్‌కు చేర్చాడని చెప్పాడు. అంతేకాదు ఆటో డ్రైవర్ కూడా 20 నుంచి 25 నిమిషాల్లోనే 2500 రూపాయలు సంపాదించాడని ఎక్స్ పోస్ట్‌లో హుస్సేన్ రాశాడు.
అలాంటి ఆటోడ్రైవర్ తెలివితేటలకు హుస్సేన్ విస్మయం చెందానని అన్నారు. అలాంటి ఆటో డ్రైవర్లు నాలాంటి వారి కోసమే ఎదురు చూస్తుంటారని అన్నారు. ఇలాంటి గిరాకీ రోజుకు ఒకటి దొరికినా హాయిగా నెలకు 75,000 సంపాదించుకోవచ్చునని రాశాడు. ఈ స్టోరీ ఇప్పుడు వైరల్‌గా మారడంతో పలువురు కామెంట్స్ చేస్తున్నారు.