తమ్ముడికి భూమ్మీద నూకలున్నాయ్…పులి నోటికి చిక్కినట్టే చిక్కి తప్పించుకున్నాడు..
ఇటీవల అడవిలోని పులులు, సింహాలు తరచూ జనావాసాల్లోకి రావటం మనుషులు, పెంపుడు జంతువులపై దాడి చేయటం వంటి ఘటనలు ఎక్కువగా చూస్తున్నాం. అప్పుడప్పుడు సఫారికి వెళ్లిన పర్యాటకులపై కూడా పులి దాడి చేసిన సంఘటనలు మాత్రం చూస్తుంటాం. ఇలాంటి మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

పులులు వేటాడే జంతువులు. అవి ఎప్పుడూ వాటికి కావాల్సిన ఆహారం కోసం పొంచి ఉంటాయి. ఆకలితో ఉన్న పులులు కనిపించిన జంతువులే కాదు మనుషులను కూడా వదలిపెట్టవు. ఇటీవల అడవిలోని పులులు, సింహాలు తరచూ జనావాసాల్లోకి రావటం మనుషులు, పెంపుడు జంతువులపై దాడి చేయటం వంటి ఘటనలు ఎక్కువగా చూస్తున్నాం. అప్పుడప్పుడు సఫారికి వెళ్లిన పర్యాటకులపై కూడా పులి దాడి చేసిన సంఘటనలు మాత్రం చూస్తుంటాం. ఇలాంటి మరో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో సఫారీ సమయంలో ఒక పులి ఒక పర్యాటకుడిపై దాడి చేసింది. కానీ, అతను తృటిలో తప్పించుకున్నాడు. ఈ భయానక దృశ్యం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. శ్రీకాంత చిన్ను అనే ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయబడిన ఈ వీడియోలో సఫారీ సమయంలో ఒక పర్యాటకుడు ఒక జింక పిల్లను చూసి కారు దిగాడు. దానికి ఏదో ఆహారం పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. కానీ, ఆ జింక ఎందుకు బెదిరిపోయి చూస్తోంది. అంతలోనే మెరుపు వేగంతో దూరం నుంచి పెద్ద పుల్లి దూసుకువచ్చింది. అదృష్టవశాత్తు అతడు తృటిలో దాని నోటికి చిక్కకుండా తప్పించుకున్నాడు.
అమాంతంగా పులి అతని వైపు దూసుకురావడంతో ఆ వ్యక్తి జింక పిల్లను వదిలి పక్కకు దూకాడు. అందువల్ల అతను పులికి ఆహారంగా మారకుండా తృటిలో తప్పించుకున్నాడు. అక్కడ ఉన్న పర్యాటకులు ఈ దృశ్యాన్ని తమ మొబైల్ కెమెరాలలో బంధించారు. పులిని చూసిన వెంటనే వారు తమ వాహనాన్ని కూడా వెనక్కి మళ్లీంచారు.
వీడియో ఇక్కడ చూడండి..
కాగా,ఇంటర్‌నెట్‌లో వైరల్‌గా మారిన ఈ వీడియోను లక్షలాది మంది చూశారు. ఈ వీడియోపై చాలా మంది వివిధ రకాలుగా వ్యాఖ్యానించారు. ఒకరు దీనిపై స్పందిస్తూ..పులి నుండి తప్పించుకున్న వ్యక్తి ఎక్కడికి పారిపోయాడు? అని అడిగారు. మరొకరు, సఫారీ సమయంలో అడవిలో వాహనం దిగి జింకను పెంపుడు జంతువు అనుకుని వెళ్లినందుకు సదరు వ్యక్తిపై అటవీ శాఖ కఠిన చర్యలు తీసుకోవాలంటూ వ్యాఖ్యానించారు. మరొకరు, ఇది నిజమైన వీడియో కాదు, ఇది AI వీడియో అంటూ కామెంట్ చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి…




