ఎలా వస్తాయి ఇలాంటి ఆలోచనలు.. టమాటోతో ఐస్‌క్రీమ్ రోల్.. దుమ్మేత్తిపోస్తున్న నెటిజన్లు

|

May 18, 2024 | 7:17 PM

ప్రస్తుతం ఆహారంతో అనేక రకాల ప్రయోగాలు చేస్తున్నారు. ఆహారాన్ని మరింత రుచికరంగా తయారు చేసేందుకు రకరకాల ప్రయోగాలు చేయడం ప్రారంభించారు. అయితే కొంత మంది ప్రయోగాల పేరుతో ఆహారం టేస్టుని నాశనం చేస్తున్నారు. ప్రయోగాల పేరుతో ఏదోకటి తయారు చేయడం ప్రారంభించారు. ఇలాంటి వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్ అయినప్పుడల్లా.. ప్రజలు వాటిని ఒకరితో ఒకరు పంచుకుంటారు. వీడియోలకు తమ స్పందనలను రకరాకాల కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు.

ఎలా వస్తాయి ఇలాంటి ఆలోచనలు.. టమాటోతో ఐస్‌క్రీమ్ రోల్.. దుమ్మేత్తిపోస్తున్న నెటిజన్లు
Tomato Ice Cream
Image Credit source: Instagram
Follow us on

ప్రతిరోజూ ఇంటర్నెట్‌లో రకరకాల ఫన్నీ వీడియోలు వైరల్ అవుతునే ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ఈ రోజుల్లో వింతైన ఆహారం, పానీయాల ప్రయోగాలతో కూడిన వీడియోలను వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అయితే ప్రతి వీడియోను చూసి ఆనందించాల్సిన అవసరం ఉండదు. అయితే కొన్ని వీడియోలు చూస్తే అసహ్యం కలిగించే విధంగా ఉంటాయి. అలాంటి వీడియో ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఇది చూసిన తర్వాత ఎవరికైనా సరే కోపం ఆకాశాన్ని తాకుతుందంటే నమ్మండి.

ప్రస్తుతం ఆహారంతో అనేక రకాల ప్రయోగాలు చేస్తున్నారు. ఆహారాన్ని మరింత రుచికరంగా తయారు చేసేందుకు రకరకాల ప్రయోగాలు చేయడం ప్రారంభించారు. అయితే కొంత మంది ప్రయోగాల పేరుతో ఆహారం టేస్టుని నాశనం చేస్తున్నారు. ప్రయోగాల పేరుతో ఏదోకటి తయారు చేయడం ప్రారంభించారు. ఇలాంటి వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్ అయినప్పుడల్లా.. ప్రజలు వాటిని ఒకరితో ఒకరు పంచుకుంటారు. వీడియోలకు తమ స్పందనలను రకరాకాల కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇక్కడ వీడియో చూడండి

టొమాటో ఐస్ క్రీమ్ తయారు చేస్తున్న వీడియో చూడవచ్చు. ఇది మీకు వింతగా అనిపించినా పూర్తిగా నిజం. ఈ క్లిప్‌లో ఒక వ్యక్తి టమోటాను కోసి దానిపై పాలు పోయడంతో ఐస్ క్రీమ్ తయారు చేయడం చూడవచ్చు. దీని తర్వాత అతను ఐస్ క్రీమ్ ను తయారు చేసే విధంగా మిక్స్ చేశాడు. ఇది చూడటానికి చాలా బాగుంది. అయితే దీని రుచి ఎలా ఉంటుందో తిన్నవారికే తెలుసు!

ఈ వీడియో instaలో foodb_unk అనే ఖాతాలో షేర్ చేశారు. ఈ వార్త రాసే వరకు వేల మంది దీనిని చూసి కామెంట్ చేస్తూ తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఒకరు ఇలా వ్రాశారు. ఇలాంటి వింత ఐస్ క్రీమ్ ఎవరు తింటారు, సోదరా?’ మరొకరు.. చాలా మంది వినియోగదారులు ఈ రెసిపీని చూసి ఆశ్చర్యపోతున్నారు. కలత చెందుతున్నారు. మొత్తానికి ఈ వీడియో చూసి జనాలు ఎందుకు ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేస్తున్నారు. మమ్మల్ని ఇలా ఎందుకు చిత్రహింసలకు గురిచేస్తున్నారని అని కామెంట్ చేస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..