Viral Video: ఎగురుతున్న విమానంలో పాము ప్రత్యక్షం.. హడలెత్తిన ప్రయాణికులు.. వీడియో వైరల్

|

Jan 20, 2024 | 7:03 AM

తక్కువ ధరలకే విమానయాన సేవలు అందించే సంస్థ థాయ్ ఎయిర్ ఏషియా. అయితే ఈ విమానంలో ఇటీవల పాము కనిపించింది. దీంతో విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఒక్కసారిగా హడలెత్తిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బ్యాంకాక్ నుంచి పుకెట్ కు బయలుదేరిన విమానంలో పాము ఉన్నట్లు రీల్స్ చేసే ఒకరు గుర్తించారు. ఆ సంఘటనను తన ఫోన్లో వీడియో తీశారు.

Viral Video: ఎగురుతున్న విమానంలో పాము ప్రత్యక్షం.. హడలెత్తిన ప్రయాణికులు.. వీడియో వైరల్
Snake On Flight
Follow us on

తక్కువ ధరలకే విమానయాన సేవలు అందించే సంస్థ థాయ్ ఎయిర్ ఏషియా. అయితే ఈ విమానంలో ఇటీవల పాము కనిపించింది. దీంతో విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఒక్కసారిగా హడలెత్తిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బ్యాంకాక్ నుంచి పుకెట్ కు బయలుదేరిన విమానంలో పాము ఉన్నట్లు రీల్స్ చేసే ఒకరు గుర్తించారు. ఆ సంఘటనను తన ఫోన్లో వీడియో తీశారు. తన వ్యక్తిగత రీల్స్ ఖాతాతో పాటు ఎక్స్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది. దీనిని చూసిన ప్రతి ఒక్కరూ వివిధ రకాల కామెంట్స్ చేస్తున్నారు. గతంలో బస్సుల్లో, రైళ్లల్లో పాములు సంచరించడం చూశాం. అయితే అత్యంత శుభ్రంగా, ప్రత్యేక సిబ్బంది పర్యవేక్షణలో ఉండే విమానాల్లో కూడా పాములు వస్తాయా అని షాక్ కి గురవుతున్నారు ప్రయాణికులు.

జనవరి 13న థాయ్ ఎయిర్ ఏషియాకు చెందిన ఎఫ్‌డీ3015 విమానంలో ఈఘటన చోటు చేసుకుంది. విమానం ల్యాండ్ అయ్యేలోపు ఆ చిన్న పామును సిబ్బంది పట్టుకున్నారు. దీంతో ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. థాయ్ ఎయిర్ఏషియా విమానం డాన్ మువాంగ్ విమానాశ్రయం నుంచి బయలుదేరి ఫుకెట్‎లో దిగాల్సి ఉంది. విమానం గాల్లో ఎగురుతున్న సమయంలో ఒక ప్రయాణికుడు చిన్న పామును గుర్తించారు. వెంటనే సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో ప్లైన్ గాల్లో ఎగురుతున్న సమయంలోనే దానిని తొలగించారు సిబ్బంది. ప్లాస్టిక్ బాటిల్లోకి పంపించి దానిని లగేజ్ పెట్టుకునే అల్మారాలో భద్రపరిచారు. విమానం ల్యాండ్ అయిన వెంటనే ఆ పామును బయటకు వదిలేశారు. ఇది విషపూరితమైనది కాదని తెలిపారు. విమానాలు ప్రయాణానికి సిద్దంగా ఉన్నప్పుడు ప్యాసింజర్ల క్యారీ ఆన్ లగేజీని ఫుకెట్ విమానాశ్రయంలో క్షుణ్ణంగా పరిశీలించారు. అయినప్పటికీ పాముల లోపలికి ఎలా వచ్చిందన్న మిస్టరీ మాత్రం ఇప్పటికీ వీడలేదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..