నాన్న సింహం సింగిల్‌గా వస్తుంది.. పందులే గుంపులుగా వస్తాయి..అన్నది ఓ తెలుగు సినిమా డైలాగ్. నిజానికి ఏనుగులు, గేదేలు, తదితర జంతువులే గుంపులు గుంపులుగా వస్తాయి. సింహాలు ఎక్కువగా ఒంటరిగానే సంచరిస్తుంటాయి. కానీ ఇక్కడోక అరణ్యంలో మనుషుల మాదిరిగా వాకింగ్ చేస్తున్నట్లుగా ఒకేసారి ఆరు సింహాలు ఓ జట్టుగా, చక్కగా కలిసి నడుస్తున్న వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది. వీడియో చూసిన ప్రతిఒక్కరూ షాక్ అవుతున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే…
అది రహదారిని ఆనుకుని ఉన్న అటవీ ప్రాంతంగా తెలుస్తోంది. రెండు టాప్‌లెస్ జీపుల్లో పర్యాటకులు ఆ ప్రాంతంగుండా వెళ్తున్నారు. వారి వాహనాలు అప్పుడే కాస్త ముందుకు వెళ్లాయి. అంతలోనే వారి వెనుక వైపుగా ఓ పులుల మంద ప్రత్యక్షమైంది. ఒకటి కాదు, రెండు కాదు..ఏకంగా ఒకేసారి ఆరు పులులు కలిసి అటవీ మార్గంలో నడుస్తున్నాయి. అయితే కొన్ని సెకన్ల తరువాత వెనుక నుండి ఒక వాహనం పులుల వద్దకు వస్తుంటుంది. అంతేకాదు ఆ వాహనాన్ని గుర్తించిన ఒక పులి ఆ వాహనం ముందు వరకు వచ్చింది. వాహనంలో మనుషుల్ని కూడా చూసింది. కానీ, పాపం అది వారికి ఎలాంటి హానీ చేయలేదు..పైగా చూసిచూడనట్టుగా తన దారిన తను అడవిలోకి పరిగెత్తింది. ఈ మేరకు ఈ వీడియో ఎప్పుడు ఎక్కడ చిత్రీకరించబడిందో స్పష్టంగా తెలియలేదు. కానీ, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుశాంత నంద వీడియోని షేర్ చేశారు.
If you haven’t seen a tiger herd, here it is?
Remarkable here to note is, a tigress usually have a litter of 2 to 4 only. Five is unusual and survival of all the cubs is rare. Indicating a high density of prey animals in the habitat & little human influence on it. pic.twitter.com/x4tQFiA0z1
— Susanta Nanda IFS (@susantananda3) June 12, 2022
దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తుంది. “ఇది నిజంగా ఆసక్తికరమైన విషయం అంటూ నెటిజన్లు షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇది నిజమేనా అంటూ మరికొందరు నెటిజన్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు చాలా మంది నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ రకరకాలుగా ట్వీట్ చేశారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి