Viral Video : వేటాడుతుండగా.. బావిలో పడ్డ పులి, అడవి పంది.. చివరికి ఏమైందంటే.?

అడవి పంది, పులి రెండూ బావిలో పడిపోయాయి. కానీ, ఆ తర్వాత పులి కూడా తన ప్రాణాలను కాపాడుకోవడం గురించి ఆందోళనలో పడింది. తన ఆహారం గురించి మర్చిపోయింది. రెండు జంతువులు ఎవరైనా తమను రక్షించే వారు వస్తారనే ఆశతో గంటల తరబడి నీటిలో తేలుతూ వేచి ఉన్నాయి. నీటిలో మునిగిపోయే ప్రమాదం ఉన్నందున, రెండు జంతువులు వాటి సహజ ప్రవర్తనకు విరుద్ధంగా కలిసి విశ్రాంతి తీసుకుంటూ కనిపించాయి. ఇది చూసిన స్థానికులు కూడా ఆశ్చర్యపోయారు.

Viral Video : వేటాడుతుండగా.. బావిలో పడ్డ పులి, అడవి పంది.. చివరికి ఏమైందంటే.?
Tiger And Boar Fall Into Well

Updated on: Feb 09, 2025 | 12:49 PM

అడవి పందిని వెంబడించేటప్పుడు పులి, పంది రెండూ ఒకే బావిలో పడిపోయాయి. జికురై అటవీ ప్రాంతంలోని పిపారియా హర్దులి గ్రామంలో ఈ సంఘటన జరిగింది. మంగళవారం ఉదయం నీళ్ల కోసం వచ్చిన గ్రామస్తులకు బావిలో పడ్డ పంది, పులి కనిపించాయి. వెంటనే సమీప అటవీ అధికారులను సమాచారం అందించారు. కాగా, 4 గంటల పాటు శ్రమించి ఆ రెండు జంతువుల్ని రక్షించారు ఫారెస్ట్‌ అధికారులు. రెండు జంతువులు కలిసి ఉండటం వల్ల సహాయక చర్యలు కష్టంగా మారిందని రిజర్వ్ డిప్యూటీ డైరెక్టర్ రజనీష్ కుమార్ సింగ్ అన్నారు. మూడేళ్ల వయసున్న పులి ఒక పందిని వెంబడిస్తూ బావిలో పడిపోయిందని రిజర్వ్ డిప్యూటీ డైరెక్టర్ రజనీష్ కుమార్ సింగ్ తెలిపారు.

అడవి పంది, పులి రెండూ బావిలో పడిపోయాయి. కానీ, ఆ తర్వాత పులి కూడా తన ప్రాణాలను కాపాడుకోవడం గురించి ఆందోళనలో పడింది. తన ఆహారం గురించి మర్చిపోయింది. రెండు జంతువులు ఎవరైనా తమను రక్షించే వారు వస్తారనే ఆశతో గంటల తరబడి నీటిలో తేలుతూ వేచి ఉన్నాయి. నీటిలో మునిగిపోయే ప్రమాదం ఉన్నందున, రెండు జంతువులు వాటి సహజ ప్రవర్తనకు విరుద్ధంగా కలిసి విశ్రాంతి తీసుకుంటూ కనిపించాయి. ఇది చూసిన స్థానికులు కూడా ఆశ్చర్యపోయారు.

ఇవి కూడా చదవండి

అయితే, రంగంలోకి దిగిన ఫారెస్ట్‌ రెస్క్యూ టీం.. ఒక పట్టె మంచానికి తాళ్లు కట్టి బావిలోకి దించారు. ఆ పులి, అడవి పంది ఆ మంచం మీదికి వెళ్లి ఊపిరి పీల్చుకున్నాయి. హైడ్రాలిక్ క్రేన్‌, బోను సాయంతో చివరికి వాటిని రక్షించారు. ఈ సహాయక చర్యలో దాదాపు 60 మంది సిబ్బంది పాల్గొన్నారు. రక్షణ తర్వాత, చీఫ్ వైల్డ్ లైఫ్ కన్జర్వేటర్ సాగర్ జిల్లాలోని వీరాంగన దుర్గావతి టైగర్ రిజర్వ్‌లోని నౌరదేహి వన్యప్రాణుల అభయారణ్యంలో పులిని విడిచిపెట్టాలని ఆదేశించారని సింగ్ తెలిపారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి