Video Viral: ఓరి దేవుడో.. పడవపై పడిన పిడుగు.. గూస్ బంప్స్ తెప్పించే వీడియో

వర్షం వస్తున్న సమయంలో మెరుపులు రావడం సహజమే. కొన్ని సార్లు పిడుగులు కూడా పడుతుంటాయి. కొన్నిసార్లు ఇది ప్రాణాంతకంగా మారుతుంది. భారతదేశంలో పిడుగుల కారణంగా ఏటా వందల మంది చనిపోతున్నారని పలు అధ్యయనాలు..

Video Viral: ఓరి దేవుడో.. పడవపై పడిన పిడుగు.. గూస్ బంప్స్ తెప్పించే వీడియో
Thunderbolt Video

Updated on: Aug 20, 2022 | 7:36 AM

వర్షం వస్తున్న సమయంలో మెరుపులు రావడం సహజమే. కొన్ని సార్లు పిడుగులు కూడా పడుతుంటాయి. కొన్నిసార్లు ఇది ప్రాణాంతకంగా మారుతుంది. భారతదేశంలో పిడుగుల కారణంగా ఏటా వందల మంది చనిపోతున్నారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రస్తుతం మెరుపులు, పిడుగులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్లిప్ ను చూసిన తర్వాత కచ్చితంగా వెన్నులో వణుకు పుడుతుంది. సముద్రపు ఒడ్డులో నిలిపి ఉన్న ఓ పడవపై పిడుగు పడటాన్ని ఈ వీడియోలో చూడవచ్చు. ఈ వీడియోలో సముద్రంలో చాలా పడవలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఒడ్డున నిలిపి ఉన్నాయి. ఆ సమయంలో కొద్దిగా వర్షం కురుస్తోంది. ఇంతలో కొన్ని సెకన్ల వ్యవధిలో ఒక మెరుపు పడవను తాకుతుంది. దీంతో పడవలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఎవరికైనా నష్టం జరిగిందా లేదా అనే విషయంపై స్పష్టత లేనప్పటికీ వీడియో చాలా భయభ్రాంతులకు గురి చేస్తోంది.

ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. కేవలం 9 సెకన్ల నిడివి కలిగిన ఈ వీడియోను ఇప్పటివరకు 4 లక్షల 89 వేలకు పైగా వీక్షించగా, 12 వేల మందికి పైగా వీడియోను లైక్ చేశారు. అంతే కాకుండా ఈ సంఖ్య ఇంకా పెరుగుతోంది. వీడియో చూసిన తర్వాత ప్రజలు నెటిజ్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఆ పడవ చాలా ఎత్తులో ఉందని, అందుకే దానిపై పిడుగు పడిందని అంటున్నారు. ఈ వీడియో చూసి, ఆశ్చర్యానికి గురవుతున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..