Viral: మానవత్వం చూపిన మూగజీవాలు.. మృగాళ్ల నుంచి చిన్నారిని కాపాడిన సింహాలు.!

|

Apr 29, 2021 | 1:59 PM

'మృగరాజు'.. ఈ పేరు వింటే చాలు గుండె జారిపోతుంది. అదిగో దూరంలో కనిపించినా అంతే.. గుండెల్లో దడ మొదలవుతుంది...

Viral: మానవత్వం చూపిన మూగజీవాలు.. మృగాళ్ల నుంచి చిన్నారిని కాపాడిన సింహాలు.!
Lions Save Girl (1)
Follow us on

‘మృగరాజు’.. ఈ పేరు వింటే చాలు గుండె జారిపోతుంది. అదిగో దూరంలో కనిపించినా అంతే.. గుండెల్లో దడ మొదలవుతుంది. అడవికి రాజులు అయిన సింహాలు మానవత్వాన్ని చూపించాయి. మృగాళ్ల బారి నుంచి ఓ చిన్నారిని రక్షించి.. ఆమెకు కంటికి రెప్పలా ఉన్నాయి. ఈ సంఘటన ఆఫ్రికాలోని ఇథోపియాలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇథోపియా దేశ రాజ‌ధాని అడ్డిస్ బాబా అనే ప్రాంతంలో 12 ఏళ్ల బాలిక  కిడ్నాప్‌కు గురైంది. కిడ్నాపర్లు ఆమెను లైంగికంగా వేధింపులకు గురి చేసి.. బలవంతంగా పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నించారు. అయితే చిన్నారి కిడ్నాపర్ల బారి నుంచి తప్పించుకుని ఓ అడవిలోకి పారిపోయింది. ఇక చిన్నారి కోసం అడవిలోకి వెళ్లిన కిడ్నాపర్లకు ఒక్కసారిగా షాక్ తగిలింది. ఆమెను మూడు సింహాలు కాపలా ఉండటం చూసి.. కిడ్నాపర్లు అక్కడ నుంచి బ్రతుకు జీవుడా అంటూ పరారయ్యారు.

అటు తన కుమార్తె కనిపించడం లేదని బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. వారు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేసారు. ఈ క్రమంలోనే కిడ్నాపర్లు పోలీసులకు చిక్కారు. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టగా.. కిడ్నాపర్లు అసలు విషయాన్ని బయటపెట్టారు. చిన్నారి సురక్షితంగా ఉందని.. ఆమెను సింహాలు కాపలా కాస్తున్నాయని తెలిపారు.

దీనితో ఒక్కసారిగా షాక్ తిన్న పోలీసులు సంఘటనాస్థలానికి వెళ్లగా.. అక్కడ తీవ్ర గాయాలతో ఉన్న చిన్నారిని అత్యవసర చికిత్స నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు. అనంతరం ఆమె స్పృహలోకి వచ్చిన తర్వాత అసలు విషయాన్ని పోలీసులకు చెప్పింది. చిన్నారిని మృగాళ్ల బారి నుంచి కాపాడిన సింహాలపై పోలీసులు ప్రశంసలు కురిపించారు. కాగా, ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

Read also: ఊపిరి బిగ బెట్టండి.. అంతే.. మీకు కరోనా ఉందో లేదో తెలిసిపోతుంది..వీడియో వైరల్.. మరి అందులో నిజమెంత?

ఈనెల 28 నుంచి జూన్‌ 1 వరకు పలు రైళ్లు రద్దు: ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే

SBI ఖాతాదారులరా అలర్ట్.. కస్టమర్లకు కీలక ప్రకటన చేసిన బ్యాంక్.. ఏం చెప్పిందంటే..

 ఏపీ సర్కార్ వినూత్న ప్రయోగం.. ఆసుపత్రి అవసరం లేకుండానే చికిత్స.. ఇంటింటికి కరోనా కిట్లు..!