ఎనిమిదేళ్ల బాలికలు ముగ్గురు అనుకోకుండా లిఫ్ట్ లోపల ఇరుక్కుపోయారు..దాదాపు అరగంట పాటు లిఫ్ట్‌లోనే ఊపిరాడక అవస్థలుపడ్డారు. నవంబర్ 29న జరిగిన ఈ సంఘటన ఘజియాబాద్ టౌన్‌షిప్‌లో వెలుగు చూసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. వీడియోలో 11వ అంతస్తులోని లిఫ్ట్‌లో మైనర్లు ఇరుక్కుపోయినట్టుగా తెలుస్తుంది. అసోటెక్ నెస్ట్ అపార్ట్‌మెంట్ గ్రౌండ్ ఫ్లోర్‌కి దిగుతున్నప్పుడు ముగ్గురు అమ్మాయిలు లిఫ్ట్‌లోనే ఇరుక్కుపోయారు.
లిఫ్ట్‌లో శివమ్ గెహ్లాట్ కుమార్తె, 8, 20వ అంతస్తులో ఉన్న తన స్నేహితురాళ్లతో కలిసి లిఫ్ట్‌లోకి ప్రవేశించింది. 24 నిమిషాల వరకు సహాయం అందకపోవడంతో చిన్నారులు భయంతో వణికిపోయారు. లిఫ్ట్ పనిచేయకపోవటంతో ముగ్గురు స్నేహితులు చిక్కుకుపోయారు. బాలికలు తమ లిఫ్ట్ తలుపులు తెరవడానికి చాలా ప్రయత్నించారు. లిఫ్ట్‌ను కదిలించడం కోసం ఆవేశంగా పదే పదే లిఫ్ట్ బటన్‌లను నొక్కారు. కానీ, విఫలమయ్యారు. తీవ్ర భయాందోళనకు గురైన బాలికలు గట్టిగట్టిగా కేకలు వేయడం ప్రారంభించారు. బాలికల అరుపులు విన్న సెక్యూరిటీ సిబ్బంది అలెర్ట్ అయ్యారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది చిక్కుకుపోయిన మైనర్లను రక్షించేందుకు వచ్చారు.
అసోటెక్ నెస్ట్ AOA అధ్యక్షుడు చిత్ర చతుర్వేది, AOA కార్యదర్శి అభయ్ ఝా నిర్లక్ష్యంగా వ్యవహరించారని గెహ్లాట్ ఆరోపించారు. ఆర్‌డబ్ల్యూఏ ఆఫీస్ బేరర్లు ఇలాంటి సరిగా పనిచేయని లిఫ్ట్‌ను చాలా కాలంగా నిర్వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లిఫ్టు పనిచేయకపోవడంపై గతంలో సొసైటీ సభ్యులు ఫిర్యాదు చేశారని, అయితే తమ అర్జీలు పెడచెవిన పెట్టారంటూ మరో బాలిక తండ్రి, ఇంటి యజమాని ఆరోపించారు.
#Ghaziabad क्रासिंग रिपब्लिक के assotech Nest society में बीती शाम 3 मासूम बच्चियां लिफ्ट में 25 मिनट तक फंसी रही, बेहद मुश्किलात के बाद उन्हें बाहर निकाल लिया गया,AOA के अध्यक्ष और सचिव के खिलाफ FIR दर्ज हुई है।यूपी की सोसाइटी में लिफ्ट एक्ट की जरूरत है @ghaziabadpolice @UPGovt pic.twitter.com/D0IsBChls9
— Lokesh Rai ?? (@lokeshRlive) December 1, 2022
అసోటెక్ నెస్ట్ హై-రైజ్‌లో లిఫ్ట్ నిర్వహణలో అలసత్వం ఉందని ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ముగ్గురు బాలికలు దాదాపు అరగంట పాటు లిఫ్ట్‌లో ఇరుక్కుపోయారు. ఈ మేరకు అపార్ట్‌మెంట్ వాసులంతా కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, క్రాసింగ్స్ రిపబ్లిక్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి