Watch: వారెవ్వా వానరమా… భలేగా వండిపెడుతుందే..! వేడి వేడి చపాతీలు చేసిపెడుతున్న కోతి

|

Dec 31, 2024 | 7:59 PM

రాణి వంటలు చేస్తున్న వీడియోను రికార్డ్‌ చేసిన ఆ కుటుంబీకులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త ఇంటర్నెట్ సంచలనంగా మారింది. ఇప్పటికి కోట్లాది మంది రాణి వీడియోలను వీక్షించారు. కాగా, వీడియోలో కోతి చక్కగా కూర్చొని చపాతీ చేస్తుండటం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. చాలా మంది ప్రజలు చాలా రకాలుగా తమ అభిప్రాయాలను తెలియజేశారు.

Watch: వారెవ్వా వానరమా... భలేగా వండిపెడుతుందే..! వేడి వేడి చపాతీలు చేసిపెడుతున్న కోతి
Monkey
Follow us on

పెంపుడు జంతువులకు సంబంధించి అనేక వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంటాయి. కొన్ని జంతువులు తమ యజమానికి ఇంటి పనుల్లో సాయం చేస్తుండటం కూడా మనం అప్పుడప్పుడూ చూస్తుంటాం. కానీ, ఎక్కడైనా, ఎప్పుడైనా కోతి ఇంటి పనులు చేయటం చూశారా..? అవును ఇక్కడో పెంపుడు కోతి ఏంచక్కా తన యజమానికి అన్ని పనులు చేసి పెడుతుంది. కోతి బట్టలు ఉతకడం, ఇల్లు తుడవటం, మసాలాలు రుబ్బడం, పిండి తడిపి చపాతీలు చేయటం, పొలం పనుల్లో కూడా సాయం చేస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇంటర్‌నెట్‌లో వేగంగా వైరల్‌ అవుతోంది.

అయితే, కోతికి ఇల్లు ఉండదు.. అలాగని తోటి వారికి కూడా ఉండనివ్వదు అనేది నానుడి..ఎందుకంటే..వానర చేష్టాలు అలా ఉంటాయి. కానీ, వైరల్‌ వీడియో యూపీలోని రాయ్‌బరేలీ జిల్లలో వెలుగు చూసింది. జిల్లాలోని సాద్వా గ్రామానికి చెందిన విశ్వనాథ్ అనే రైతు ఒక కోతిని చేరదీశాడు. దానికి ముద్దుగా రాణి అని పేరు పెట్టుకున్నాడు. ఇంటి పనులు చేయడం అలవాటు చేశాడు. చివరికి ఆ కోతి ఇంట్లో ఓ సభ్యురాలిగా మారిపోయి వంట చేయడంతో పాటు అంట్లు తోమి పెడుతుంది. ఈ వీడియో చూసిన కొందరు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.

ఇవి కూడా చదవండి

రాణి వంటలు చేస్తున్న వీడియోను రికార్డ్‌ చేసిన ఆ కుటుంబీకులు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త ఇంటర్నెట్ సంచలనంగా మారింది. ఇప్పటికి కోట్లాది మంది రాణి వీడియోలను వీక్షించారు. కాగా, వీడియోలో కోతి చక్కగా కూర్చొని చపాతీ చేస్తుండటం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. చాలా మంది ప్రజలు చాలా రకాలుగా తమ అభిప్రాయాలను తెలియజేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..