సాధారణ సమయాల్లోనే విచ్చలవిడి మోసాలకు పాల్పడుతుంటారు సైబర్ మోసగాళ్లు. ఇక పండగలు, ప్రత్యేక దినాల్లో అయితే వారి మోసాలకు అంతే ఉండదు. గిఫ్ట్‌ల పేరిట ఏవేవో లింక్‌లు పెట్టి అమాయకులను బురిడీ కొట్టిస్తుంటారు. సోషల్ మీడియా సైట్లలో ముఖ్యంగా వాట్సప్‌లో ఇలాంటి మెసేజ్‌లు ఎక్కువగా కనిపిస్తుంటాయి. అలా ప్రస్తుతం కొత్త సంవత్సరం గిఫ్ట్ పేరిట వాట్సప్‌లో ఓ కొత్త స్కామ్ నడుస్తోంది. దానిపేరు Rediroff.ru. దీని ద్వారా కొత్త ఏడాదిలో ఖరీదైన గిఫ్ట్‌లు గెలుచుకోవచ్చంటూ వాట్సప్‌లో కొన్ని లింక్‌లు హల్‌చల్ చేస్తున్నాయి. ఈ లింక్ ఓపెన్ చేయగానే ఓ సర్వే నిర్వహిస్తారు. అనంతరం బహుమతులంటూ మరో వెబ్‌పేజీ ఓపెన్ అవుతుంది.
వెబ్‌డార్క్‌కు విక్రయిస్తూ..
ఇక్కడే సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టిస్తున్నారు. ఇక్కడ మీ పేరు, చిరునామా, పుట్టిన తేదీ, బ్యాంక్ ఖాతా తదితర వ్యక్తిగత వివరాలు ఎంటర్ చేయమని అడుగుతున్నారు. తద్వారా బ్యాంకు ఖాతాను యాక్సెస్ చేసి అందులోని సొమ్మును చోరీ చేయడమో లేదా సమాచారాన్ని దొంగలించి డార్క్ వెబ్ లాంటి ఫిషింగ్ వెబ్‌సైట్లు (సైబర్ నేరాలకు పాల్పడేవి) విక్రయిస్తున్నారు. ఈ స్కామ్‌తో పాటు పలువురు కేటుగాళ్లు ‘Excuse me’, Who are you’, I found you on my contact list’ అంటూ మెసేజ్‌లు చేసి మోసాలకు పాల్పడుతున్నారు. ఈక్రమంలో ఇలాంటి సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ లింక్‌లు క్లిచ్ చేయడం స్మార్ట్‌ఫోన్‌లో రిమోట్ యాప్‌లు డౌన్‌లౌడ్ అయ్యే ప్రమాదముందని, వీటి ద్వారా మన సమచారాన్ని ఈజీగా యాక్సెస్ చేయవచ్చంటున్నారు. కాబట్టి సోషల్ మీడియాలో వచ్చే లింక్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని.. ముఖ్యంగా లింక్ URL లో చివర .ru అని ఉంటే దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్ చేయవద్దని, అలాంటి మెసేజ్‌లు పంపిన వ్యక్తిన తక్షణమే బ్లాక్ చేయాలని సూచిస్తున్నారు.
Also Read:
Online shopping: ఖరీదైన ఐఫోన్ ఆర్డర్ చేశాడు.. వచ్చిన పార్శిల్‌ను చూసి కంగుతిన్నాడు..
Vaishno Devi Temple: వైష్ణో దేవి ఆలయంలో తొక్కిసలాట.. 12 మంది మృతి, పలువురికి తీవ్ర గాయాలు
Milk Price: సామాన్యులకు భారీ షాక్.. పెరిగిన పాల ప్యాకెట్ ధరలు.. ఈరోజు నుంచే అమలు..