Viral Video: ఈ పిల్లి మహా ముదురు గురూ.. కాయిన్‌తో మాయాజాలం చేసేస్తోంది.. చూస్తే బాబోయ్ అంటారు..!

|

Jul 25, 2023 | 8:03 PM

జంతువులు, పక్షులతో సావాసం.. అందమైన, అద్భుతమైన అనుభూతిని ఇస్తాయి. అమ్మ ఒడి తరువాత ప్రకృతి ఒడిలోనే అంతటి ప్రశాంతత లభిస్తుంది. అందుకు చాలా మంది తమ ఇళ్లలో పెంపుడు జంతువులను పెంచుకుంటుంటారు. కుక్క, పిల్లి, పక్షులను పెంచుకుంటారు. వాటిని అల్లారుముద్దుగా చూసుకుంటారు. తమ కుటుంబ సభ్యుల మాదిరిగానే వాటి ఆలనా పాలనా చూస్తారు.

Viral Video: ఈ పిల్లి మహా ముదురు గురూ.. కాయిన్‌తో మాయాజాలం చేసేస్తోంది.. చూస్తే బాబోయ్ అంటారు..!
Cat
Follow us on

జంతువులు, పక్షులతో సావాసం.. అందమైన, అద్భుతమైన అనుభూతిని ఇస్తాయి. అమ్మ ఒడి తరువాత ప్రకృతి ఒడిలోనే అంతటి ప్రశాంతత లభిస్తుంది. అందుకు చాలా మంది తమ ఇళ్లలో పెంపుడు జంతువులను పెంచుకుంటుంటారు. కుక్క, పిల్లి, పక్షులను పెంచుకుంటారు. వాటిని అల్లారుముద్దుగా చూసుకుంటారు. తమ కుటుంబ సభ్యుల మాదిరిగానే వాటి ఆలనా పాలనా చూస్తారు. అవి కూడా తమ యజమాని పట్ల ఎంతో ప్రేమను చూపిస్తారు. వారితో సరదాగా గడుపుతాయి. వారితో ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తాయి.

ఇకపోతే, నాణేలతో బొమ్మ బొరుసు, చిత్తు బొత్తు ఆట గురించి మనకు తెలిసిందే. చాలా మంది ఈ ఆటను ఆడుతారు. ఇంట్లో సరదాగా, జూదంలోనూ, ఆఖరికి క్రికెట్‌లోనూ కాయిన్‌తో టాస్ వేస్తారు. అచ్చం ఇలాగే ఓ పిల్లి కూడా టాస్ వేసి నెటిజన్లందరినీ షాక్‌కు గురి చేసింది. అమ్మ బాబోయ్.. ఇది మామూలు పిల్లి కాదండోయ్ అంటున్నారు ఇందుకు సంబంధించిన వీడియో చూసి నెటిజన్లు. ఇందుకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ వ్యక్తి, తన పిల్లితో కలిసి కాయిన్‌ను ఎగురవేస్తూ బొమ్మ బొరుసు ఆడాడు. ముందుగా అతను కాయిన్‌ను ఎగురవేయగా.. పక్కనే ఉన్న దాన్ని గమనించింది. అతను కాయిన్ ఎగరేసిన విధానాన్ని నిశితంగా పరిశీలించిన ఆ పిల్లి.. తదుపరి తన వంతు వచ్చేసరికి ట్యాలెంట్‌నంతా చూపించేసింది. సెకన్ల వ్యవధిలో కాయిన్‌ను తిరగేసి.. షాక్‌కు గురి చేసింది. ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్‌లో యూజర్ల పోస్ట్ చేయగా.. అదికాస్తా వైరల్ అయ్యింది. వీడియోకు క్విక్ లెర్నర్ అని క్యాప్షన్ పెట్టారు. ఇక పిల్లి ట్యాలెంట్‌కు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..