త్రిమూర్తుల్లో లయకారుడు శివుడు.. మనదేశంలో అత్యధికంగా పూజించే దేవుడు శివుడు.. ఇంకా చెప్పలంటే.. దేశంలోనే కాదు విదేశాల్లో కూడా ఆయన భక్తులు నిండుగా ఉన్నారు. చిన్నదో, పెద్దదో ప్రతి గ్రామంలో శివుని గుడి ఉంటుంది. శివుని గురించి తెలిసిన వారికి నంది గురించి కూడా తెలుస్తుంది. వాస్తవానికి.. ఎద్దు అంటే.. నందిని శివుని వాహనంగా భావిస్తారు. కొంతమంది నందిని శివయ్యకు ద్వారపాలకుడిగా కూడా భావిస్తారు. ప్రస్తుతం ఒక ఎద్దుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని ‘నంది’ అని పిలిచినా తప్పుకాదని అంటున్నారు శివయ్య భక్తులు. ఎందుకంటే వైరల్ వీడియోలో ఉన్న ఈ ఎద్దు శివునికి నిజమైన భక్తుడిగా కనిపిస్తుంది.
యూపీలోని ఓ చిన్న శివాలయానికి రోజూ నిర్ణీత సమయానికి వచ్చి..ఈ ఎద్దు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తుందని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు.. ప్రతి రోజూ లెక్కకు ఎక్కువ తక్కువ కాకుండా ఖచ్చితంగా 108 ప్రదక్షిణలు చేస్తుందట. ఎద్దు చేసే ప్రదక్షణలో ఒకటి ఎక్కువ లేదా ఒకటి తక్కువ కాదు. తన ప్రదక్షణలు లెక్కలు వేసుకుంటూ తిరుగుతున్నట్లు అనిపిస్తుందని చూపరులు అంటున్నారు.
సాధారణంగా మనుషులు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే లెక్కలు లెక్కిస్తారు.. మరి ఈ ఎద్దు ఎలా లెక్కపెడుతుందన్నదని అందరూ ఆశ్ఛర్యం వ్యక్తం చేస్తున్నారు. గుడి చుట్టూ ఎద్దు ఎలా తిరుగుతుందో వీడియోలో చూడొచ్చు. ఈ సమయంలో, మహిళలు కూడా ఆలయం లోపల శివుడిని పూజిస్తున్నారు. ఎవరిని పట్టించుకోకుండా.. తనకు ఎవరితోనూ పనిలేదు అన్నట్లు.. కేవలం శివయ్య మాత్రమే ముఖ్యం అన్నట్లుగా శివభక్తిలో నిమగ్నమై ఎద్దు గుడి చుట్టూ ప్రదక్షణలు చేస్తోంది.
ప్రదక్షిణలు చేస్తోన్న ఎద్దు
వాస్తవానికి ఈ వీడియో పాతదిగా తెలుస్తోంది. అయినా సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అవుతోంది.ఇలాంటి శివ భక్తుడిని మీరు చూసి ఉండరు. ఈ ఎద్దును నిజమైన శివ భక్తుడు అని అంటున్నారు నెటిజన్లు..
మరిన్ని ట్రెండింగ్ వీడియో వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..