దొంగతనం చేసేందుకు ఓ దుకాణంలోకి ప్రవేశించిన ఓ దొంగ చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ దొంగ షాపు పైకప్పు పగులగొట్టి లోపలికి ప్రవేశించాడు. కానీ, అతడు వచ్చిన మర్చిపోయాడు.. లేదంటే.. అతనికి ఊహించని నిధి కనిపించిందో తెలియదుగానీ.. అతడు చేసిన చూస్తే ఎవరికైనా సరే నవ్వు ఆపుకోవడం కష్టమే అవుతుంది. ఇంతకీ చోరీ ఘటనలో ఆ దొంగ చేసిన పనేంటో తెలిస్తే..
వైరల్ వీడియో ఒక దొంగతనానికి సంబంధించినదిగా తెలుస్తోంది. అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న దొంగలు ఇక్కడ ఓ షాపు పైకప్పు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. దొంగలు షాపులోకి ప్రవేశించి అనంతరం విలువైన వస్తువులు, నగల కోసం వెతికారు. అయితే, వారి ముందు విలువైన వస్తువులు ఉన్నాయని గుర్తించారు. దీంతో వారి పంట పండినట్టే అకున్నారేమో గానీ, దొంగల్లో ఒకడు లూటీకి ముందు సంతోషంతో డ్యాన్స్ చేయడం ప్రారంభించాడు. షాపులో అమర్చిన సీసీటీవీలో అతడు చేసిన డ్యాన్స్ దృశ్యాలు రికార్డయ్యాయి.
వైరల్ వీడియోలో దొంగ ముఖానికి ముసుగు ధరించి ఉన్నాడు. దాంతో అతని ముఖం కనిపించలేదు. కానీ, అతడు చేసిన డ్యాన్స్ మాత్రం సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డైంది. దొంగలు షాపులోకి రాగానే ఎదురుగా ఉన్న జీడిపప్పులు, బాదంపప్పులు చూసి ఆనందంతో డ్యాన్స్ చేయడం మొదలుపెట్టారని చెప్పారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి జనాలు ఫన్నీ రియాక్షన్‌లు ఇచ్చారు.
Thief started dancing inside the shop after stealing from a hardware shop in Chandauli, Uttar Pradesh.
Did he loot a big amount or did his phone rang? 🤔 pic.twitter.com/mBKQPKiWWu
— I Love Siliguri (@ILoveSiliguri) April 19, 2022
కొందరు నెటిజన్లు స్పందిస్తూ..దొంగతనం తర్వాత ఆ దొంగ ఆనందంగా డ్యాన్స్ చేస్తున్నాడని ఒకరు అడిగితే, ఎవరి ఇల్లు చోరీకి గురైంది, అతను ఏమి చేస్తున్నాడో అడగండి అంటూ మరొకరు ప్రశ్నించారు. మొత్తానికి ఈ చోరీ ఘటనను అందరూ ఎంజాయ్ చేస్తున్నామని కామెంట్ చేశారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..