Viral: 22 ఏళ్లుగా మహిళకు కూర్చుంటే నొప్పి.. డాక్టర్లు CT స్కాన్‌ చేయగా.. అరడుగు పొడవైన

22 ఏళ్లుగా ఆ మహిళ కూర్చుంటే చాలు.. తీవ్రమైన నొప్పిని అనుభవిస్తోంది. ఎందుకని అలా వస్తోందన్నది ఆమెకు అర్ధం కావట్లేదు. ఇక ఇటీవల ఓ డాక్టర్ దగ్గరకు వెళ్లి చూపించుకోగా.. అతడు చేసిన CT స్కాన్‌లో గుట్టు బయటపడింది. ఇంతకీ అదేంటంటే.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Viral: 22 ఏళ్లుగా మహిళకు కూర్చుంటే నొప్పి.. డాక్టర్లు CT స్కాన్‌ చేయగా.. అరడుగు పొడవైన
Viral News

Updated on: Sep 05, 2025 | 1:48 PM

ఓ స్త్రీ తన బాడీ పార్ట్‌లో విరిగిపోయిన థర్మామీటర్ ముక్కను పెట్టుకుని 22 సంవత్సరాలు జీవించింది. మిస్ హు అని పిలువబడే ఈ మహిళ.. ప్రాధమిక పాఠశాలలో చదువుతుండగా.. అనుకోకుండా ఆ పరికరంపై కూర్చుంది. 2 సెంటీమీటర్ల పొడవున్న ఆ థర్మామీటర్ ముక్క.. రెండు దశాబ్దాలకు పైగా ఆమె శరీరంలోనే ఉండిపోయింది. ఆస్పత్రికి చికిత్స నిమిత్తం వచ్చిన ఆమెకు డాక్టర్లు CT స్కాన్ చేసి.. ఆ పరికరాన్ని గుర్తించారు. అదృష్టవశాత్తు అందులో పాదరసం లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందన్నారు. చైనాలోని వుహాన్‌కు చెందిన సదరు రోగి.. తన స్కూల్ డేస్‌లో ఫ్రెండ్స్ ఆటపట్టించడం ద్వారా ఈ ఘటన జరిగిందని వివరించింది.

అప్పటి నుంచి కూర్చుంటుండగా ప్రతీసారి నొప్పి పుడుతోందని.. ఇక చికిత్స నిమిత్తం ఇప్పుడు ఆస్పత్రిలో చేరింది. దీంతో అక్కడి వైద్యులు ఆమె బాడీ పార్ట్ నుంచి విదేశీ వస్తువును తొలగించడానికి ప్రయత్నించారు. శస్త్రచికిత్స ద్వారా దాన్ని తొలగించారు. సైక్లింగ్ చేస్తుండగా గాయపడిన హుకు.. ఈ థర్మామీటర్ ముక్క తన శరీరంలో ఉన్నట్టు గుర్తించింది. డాక్టర్లు దాన్ని విజయవంతంగా తొలగించడంతో.. ఆమె ప్రస్తుతం ఆరోగ్యకరంగా బయటపడింది. కాగా, మెడికల్ హిస్టరీలో ఇలాంటి కేసులు చాలా రేర్ అని.. వీటిని తొలగించేటప్పుడు తగిన విషయాలు దృష్టిలో పెట్టుకోవాలని డాక్టర్లు అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్నిట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..