అయ్య బాబోయ్.. బుల్లి ట్రక్కుపై భారీ ఏనుగు స్వారీ.. పైగా ఎంత స్పీడ్‌గా వెళ్తుందో..! వీడియో చూస్తే అవాక్కే..

|

Jan 20, 2024 | 10:35 AM

అంత చిన్న వాహనంలో ఆ ఏనుగు నిలబడి వెళ్తుండటం చూసి అందరూ విస్తుపోతున్నారు. వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసి, ఇది నిజమేనా? అంటూ చాలా మంది నెటిజన్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు. పైగా వేగంగా వెళ్తున్న ట్రక్కు కారణంగా ఏనుగు కిందపడిపోయే ప్రమాదం కూడా ఉందని మరికొందరు జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అయ్య బాబోయ్.. బుల్లి ట్రక్కుపై భారీ ఏనుగు స్వారీ.. పైగా ఎంత స్పీడ్‌గా వెళ్తుందో..! వీడియో చూస్తే అవాక్కే..
big elephant riding a small vehicle
Follow us on

మానవ రవాణాతో పాటు వస్తుసామాగ్రిని తరలించేందుకు వీలుగా పలు రకాల వాహానాలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చేశాయి. మనుషులకు బస్సులు, కార్లు, మోటార్‌సైకిల్ వంటి వాహనాలు ఉండగా, ట్రక్కు, టెంపో వంటి వాహనాలు సరుకులు లోడింగ్, రవాణా కోసం తయారు చేయబడ్డాయి. బరువును బట్టి వాహనాలను ఎంపిక చేసి వాటిపై సరుకులు ఎక్కించి కావాల్సిన ప్రాంతానికి తీసుకెళ్తున్నారు. అయితే, మీరు ఎప్పుడైన భారీ శరీరంతో ఉండే గజరాజు..బుల్లి వాహనంపై స్వారీ చేయడాన్ని మీరు ఎప్పుడైనా చూశారా? అవును మీరు చిన్న ట్రక్కుపై భారీ ఏనుగు వెళ్తున్న దృశ్యం ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అది చూసిన ప్రతి ఒక్కరు.. ఈ వాహనం ఏనుగు బరువును మోయగలదా..? అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు..

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో.. రోడ్డుపై భారీ ఏనుగు చిన్న ట్రక్కులో అత్యంత వేగంతో వెళుతున్న దృశ్యం అందరినీ షాక్‌ అయ్యేలా చేస్తుంది. ఆశ్చర్యం వాహనం వేగం వల్ల కాదు, దానిపై ఎక్కించిన జంతువు కారణంగా ప్రతి ఒక్కరూ వీడియో చూసి ఆశ్చర్యపోతున్నారు. అంత చిన్న వాహనంలో ఆ ఏనుగు నిలబడి వెళ్తుండటం చూసి అందరూ విస్తుపోతున్నారు. వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసి, ఇది నిజమేనా? అంటూ చాలా మంది నెటిజన్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు. పైగా వేగంగా వెళ్తున్న ట్రక్కు కారణంగా ఏనుగు కిందపడిపోయే ప్రమాదం కూడా ఉందని మరికొందరు జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ X (గతంలో ట్విట్టర్)లో @DoctorAjayita అనే ఖాతా ద్వారా వీడియో షేర్‌ చేయబడింది. వీడియో చూసిన తర్వాత, ఒక వినియోగదారు ఇలా వ్రాశారు – ఇది నకిలీ ఏనుగు, నేను దీనిని చెన్నైలో చూశాను, ఇది చాలా వాస్తవంగా ఉందంటూ వ్యాఖ్యనించారు.. మరొక వినియోగదారు స్పందిస్తూ.. అవును ఇది ఫేక్‌ ఏనుగు.. మనుషులు తయారు చేసిన బొమ్మ.. దానికి ఏమీ కాదని అంటున్నారు.
మరోకరు..ఆటోట్రాలి నిజమైనదే. కానీ, దానిపై వెళ్తున్న ఏనుగు నకిలీది అంటూ పేర్కొన్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి