Titanic Video: సముద్ర గర్భంలో టైటానిక్ షిప్.. ఇంతకుముందెన్నడూ చూడని అద్భుతమైన వీడియో..

| Edited By: Janardhan Veluru

Sep 08, 2022 | 2:24 PM

Titanic Video: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రయాణ నౌక ‘టైటానిక్’ ప్రమాదం గురించి తెలియని వాళ్లు అంటూ ఎవరూ ఉండరు...

Titanic Video: సముద్ర గర్భంలో టైటానిక్ షిప్.. ఇంతకుముందెన్నడూ చూడని అద్భుతమైన వీడియో..
Titanic Ship
Follow us on

Titanic Ship Real Video: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రయాణ నౌక ‘టైటానిక్’ ప్రమాదం గురించి తెలియని వాళ్లు అంటూ ఎవరూ ఉండరు. మొద‌టి ప్రపంచ యుద్ధం స‌మ‌యంలో అట్లాంటిక్ మ‌హాస‌ముద్రంలో ప్రయాణం చేసిన ఈ షిప్.. 1912 నవంబర్‌ 14న సముద్రంలో ఐస్‌బర్గ్‌ను ఢీకొని ప్రమాదానికి గురైంది. దాంతో ఆ షిప్ కాస్తా మునిగిపోయింది. ఈ ఘటన నేపథ్యంలో హాలీవుడ్‌లో ‘టైటానిక్‌’ పేరుతోనే ఫేమస్ లవ్ స్టోరీతో సినిమా తీశారు. ఆ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికీ చాలా ఫేమస్ అని చెప్పాల్సిందే.

అయితే, నాడు ప్రమాదానికి గురై సముద్ర గర్భంలోకి జారిపోయిన టైటానిక్ షిప్ అవశేషాలు ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి. ఆ షిప్ నానాటికి కనమరుగవుతోంది. దానికి కారణంగా సముద్రంలోని బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా టైటానిక్‌ షిప్‌ను తినేస్తుందని శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఇదిలాఉంటే.. టైటానిక్ షిప్‌కు సంబంధించిన తాజాగా ఓ వీడియో విడుదల చేశారు సైంటిస్టులు. గతం కంటే ఎంతో క్లారిటీతో, క్వాలిటీతో మొట్టమొదటి 8కే క్లారిటీతో టైటానిక్ షిప్ అవశేషాలకు సంబంధించిన వీడియోను విడుదల చేశారు. OceanGate Expeditions పేరుతో యూట్యూబ్ ఛానెల్‌లో టైటానిక్ వీడియోను పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో ట్రెండింగ్‌లో ఉంది. సముద్రగర్భంలో శిథిలమైన ఈ టైటానిక్ షిప్ అవశేషాలను వీడియోలో బంధించారు.

ఇదిలాఉంటే.. టైటానిక్ షిప్ ‘వైట్ స్టార్ లైన్’ సంస్థ కోసం ‘హర్లాండ్ అండ్ వోల్ఫ్’ నౌకా నిర్మాణ సంస్థ తయారు చేసిన మూడు నౌకల్లో ఒకటి. 1912లో ఇది మొదటిసారిగా సముద్రయానం చేసింది. అప్పడదే ప్రపంచంలో కెల్లా అదే అతి పెద్ద ప్రయాణ నౌక. అయితే, దాని మొదటి ప్రయాణంలోనే ఏప్రిల్ 14, 1912 వ తేదీన ప్రమాదవశాత్తూ ఒక మంచు కొండను ఢీకొని సముద్రంలో మునిగిపోయింది. 1517 మంది ప్రజలు మృత్యువాత పడ్డారు. చరిత్రలో అత్యంత దురదృష్టకరమైన సంఘటనలలో ఒకటిగా మిగిలిపోయింది.

ఇవి కూడా చదవండి

దీని నిర్మాణంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం వలన అది మునిగి పోవడం అసాధ్యం అని అంతా విశ్వసించారు. ఎంత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించినా, ఎంతమంది అనుభవజ్ఞులైన సిబ్బంది ఉన్నా, అది మునిగిపోయి అపార ప్రాణనష్టాన్ని కలిగించడం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే, ఈ టైటానిక్ షిప్ అవశేషాలను 1985లో రాబర్ట్ బల్లార్డ్ నేతృత్వంలోని బృందం కనిపెట్టింది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..