సముద్రం ముందు నిలబడి పోజిచ్చింది.. కానీ అంతలోనే భారీ అలలు వచ్చి : వీడియో

| Edited By: Srinu

Mar 21, 2019 | 4:55 PM

సముద్రం అంటేనే చాలా ప్రమాదం. మనం సముద్రం ముందు నిలబడాలంటే వచ్చే అలలను చూస్తేనే జడుసుకుంటాం. ఒక్కోసారి వచ్చే భారీ అలలు బయట ఉన్నవాళ్లను కూడా లోపలికి లాక్కెళ్లుతాయి. అలాంటిది సముద్రం ముందు నిల్చొని ఉన్నప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ప్రమాదాలను కొనితెచ్చుకోకతప్పదు. అక్కడ ఆవేశపడితే ప్రాణాలకే ప్రమాదం. ఇండోనేషియాలోని ఓ టూరిస్ట్ చేసిన సాహసం ఆమె ప్రాణాలపైకి వచ్చింది. ఇండోనేషియాలోని నుసా లెంబోన్గాన్ అనే ఐలాండ్‌లో ఉన్న డెవిల్స్ టియర్ వద్ద ఓ ఘటన […]

సముద్రం ముందు నిలబడి పోజిచ్చింది.. కానీ అంతలోనే భారీ అలలు వచ్చి : వీడియో
Follow us on

సముద్రం అంటేనే చాలా ప్రమాదం. మనం సముద్రం ముందు నిలబడాలంటే వచ్చే అలలను చూస్తేనే జడుసుకుంటాం. ఒక్కోసారి వచ్చే భారీ అలలు బయట ఉన్నవాళ్లను కూడా లోపలికి లాక్కెళ్లుతాయి. అలాంటిది సముద్రం ముందు నిల్చొని ఉన్నప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ప్రమాదాలను కొనితెచ్చుకోకతప్పదు. అక్కడ ఆవేశపడితే ప్రాణాలకే ప్రమాదం. ఇండోనేషియాలోని ఓ టూరిస్ట్ చేసిన సాహసం ఆమె ప్రాణాలపైకి వచ్చింది. ఇండోనేషియాలోని నుసా లెంబోన్గాన్ అనే ఐలాండ్‌లో ఉన్న డెవిల్స్ టియర్ వద్ద ఓ ఘటన చోటు చేసుకున్నది. టూరిస్ట్ గా వచ్చిన ఓ యువతి సముద్రం పక్కన ఉన్న కొండ మీదికి వెళ్లి ఫోటోకు పోజిచ్చింది. ఇంతలోనే రాకాసి అల వచ్చి తనను ఢీకొట్టింది. దీంతో ఆ యువతి అమాంతం ఎగిరి పడిపోయింది. భారీ అలలకు ఆ యువతి ఎక్కడ పడిపోయిందా అని అంతా ఒకేసారి అరిచారు. అయితే.. ఆ యవతి చిన్న గాయాలతో బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. డెవిల్స్ టియర్ అనేది ఇండోనేషియాలో బెస్ట్ టూరిస్ట్ స్పాట్. చాలామంది టూరిస్టులు అక్కడికి రోజూ వస్తుంటారు. అక్కడి అందాలను తమ కెమెరాల్లో బంధిస్తుంటారు. ఫోటోలకు పోజులిస్తుంటారు. అయితే.. భారీ అలలు వచ్చినప్పుడు మాత్రం టూరిస్టులు ఆ అలలకు దూరంగా పరిగెడతారు. ఈ యువతి భారీ అలను గమనించకపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.