Viral Video: బుడ్డొడి టాలెంట్ అదుర్స్.. స్కూల్లో చేసిన మ్యాజిక్ చూస్తే షాకవుతారు.. నెట్టింట వీడియో వైరల్..

|

Jun 30, 2022 | 5:51 PM

ఓ పాఠశాల కుర్రాడు తన స్నేహితుల మధ్యలో నిలబడి ఉన్నాడు.. అతని చేతిలో రెండు చిన్న రంగు రాళ్లు ఉన్నాయి. అయితే తన రెండు చేతులను

Viral Video: బుడ్డొడి టాలెంట్ అదుర్స్.. స్కూల్లో చేసిన మ్యాజిక్ చూస్తే షాకవుతారు.. నెట్టింట వీడియో వైరల్..
Viral Video
Follow us on

ప్రస్తుతం సోషల్ మీడియా వలన ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉన్న అద్భుతమైన ప్రతిభ బయటకు వస్తుంది. మట్టిలో మాణిక్యాలు ఎంతో మంది ప్రపంచానికి పరిచయమవుతున్నారు. పెద్దలు మాత్రమే చిన్న పిల్లలో కూడా దాగిన టాలెంట్ ఇప్పుడు ఇంటర్నెట్ ద్వారా ప్రపంచానికి పరిచయమవుతుంది. ఇప్పటికే ఎంతో మంది ఈ సోషల్ మీడియా ద్వారా గుర్తింపు పొందినవారున్నారు. తాజాగా ఓ బుడ్డొడు చేసే మ్యాజిక్ నెటిజన్లను ఆశ్చర్యనికి గురిచేస్తుంది. రెప్పపాటులో కళ్లను మాయ చేస్తోన్న ఆ కుర్రాడి మ్యాజిక్ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇంతకీ ఏం మ్యాజిక్ చేశాడో తెలుసుకుందామా.

ఓ పాఠశాల కుర్రాడు తన స్నేహితుల మధ్యలో నిలబడి ఉన్నాడు.. అతని చేతిలో రెండు చిన్న రంగు రాళ్లు ఉన్నాయి. అయితే తన రెండు చేతులను ఒకేసారి టేబుల్ పై బోర్లించాడు.. ఆ తర్వాత రెండు చేతులలో ఉన్న రెండు బాల్స్ ఓకే చేతి కింద కనిపించాయి. ఈ మ్యాజిక్ ను కేవలం ఒకసారి మాత్రమే కాదు.. రెండు సార్లు చేసి చూపించాడు ఆ అబ్బాయి. ఆ మ్యాజిక్ కు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఆ బుడ్డొడి మ్యాజిక్ వీడియోపై క్రికెటర్ శిఖర్ ధావన్ సైతం స్పందిస్తూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ వీడియోకు నెటిజన్స్ పలు రకాలుగా స్పందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.