ఇంటికొచ్చిన పార్శిల్ చూసి షాకైన ఓ వ్యక్తి.. అందులో ఏముందా అని ఓపెన్ చేసి చూడగా.. అతడికి ఒక్కసారిగా ఫ్యూజులు ఎగిరిపోయినంత పనైంది. అసలు పార్శిల్ బాక్స్‌లో అతడికి ఏమొచ్చింది.? ఎందుకు అంతలా ఆశ్చర్యపోయాడో.? తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..
అసలు విషయానికొస్తే.. బ్రిటన్‌కు చెందిన 45 ఏళ్ల ఆండీ ఎవాన్స్ ఇంటికి కొద్దిరోజుల క్రితం ఓ పార్శిల్ వచ్చింది. ‘తాను ఏది ఆర్డర్ పెట్టలేదు కదా.! మరి ఈ పార్శిల్ ఎవరు పంపించినట్లు’ అనుకుంటూ ఆ పార్శిల్‌ను ఓపెన్ చేసిన ఆండీకి ఒక్కసారిగా ఫ్యూజులు ఎగిరిపోయాయి. అందులో అతడికి తాను 7 ఏళ్ల క్రితం ఓ ట్యాక్సీలో పోగొట్టుకున్న పర్స్ కనిపించింది. ఇంకా లోతుగా చెప్పాలంటే.. ఆ సమయంలో అందులో ఉన్న రూ. 13 వేల క్యాష్, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంక్ కార్డులన్ని అలాగే ఉండటం గమనార్హం.
కాగా, తనకొచ్చిన పార్శిల్ మీద ఉన్న ఈమెయిల్‌కు రిప్లై పంపించిన ఆండీకి అసలు విషయం బహిర్గతం అయింది. ఏ ట్యాక్సీలో అయితే ఆండీ 7 ఏళ్ల క్రితం పర్స్ పోగొట్టుకున్నానో.. ఆ ట్యాక్సీ డ్రైవర్ నిజాయితీగా పర్స్‌ను వెనక్కి పంపించాడని తెలుసొస్తుంది. అతడి నిజాయితీకి ఆండీ బహుమతిని తిరిగి పంపగా.. ఆ ట్యాక్సీ డ్రైవర్ దాన్ని సున్నితంగా తిరస్కరించాడు. ఎవరైనా పేదవాళ్లు ఉంటే.. వారికి సహాయం చేయాలని కోరాడు.