ఉత్తర భారతదేశం సహా దేశం మొత్తం చలి తీవ్రత, శీతల గాలులు విపరీతంగా వీస్తున్నాయి. మనుషులు, జంతువులు సైతం ఈ చలితో బాధపడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. హృదయాల్ని హత్తుకునేలా కనిపించిన ఈ వీడియోను ఉత్తరప్రదేశ్ పోలీసులు షేర్ చేశారు. ఈ వీడియో చూసిన ప్రజలు ఉత్తరప్రదేశ్ పోలీసులపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మన దేశంలో పోలీసులు ఎల్లవేళలా సేవకు సిద్ధంగా ఉంటారని ప్రజలు కొనియాడుతున్నారు.
ఈ వైరల్ వీడియోలో, ఒక కోతి పోలీసు కమిషనర్ క్యాంపు కార్యాలయంలోకి ప్రవేశించింది. అప్పుడు రూమ్‌లో హీటర్ ఆన్ చేసి ఉంది..అది గమనించిన ఆ కోతి.. వెచ్చగా ఉందికదా అని ఆ హీటర్ ముందు కూర్చేని హాయిగా చలికాపుకుంటూ సేద తీరుతోంది.. బయట విపరీతమైన చలితో వణికిపోయిన ఆ కోతి హీటర్ ముందు సైలెంట్‌గా కూర్చుని ఉంది. కోతులంటే.. అల్లరిచిల్లర పనులు, వానర చేష్టలతో విసుగు పుట్టిస్తాయి.. కానీ, ఈ కోతి మాత్రం మనుషులను భయపెట్టలేదు.. కార్యాలయంలోకి ప్రవేశించి గొడవ చేయలేదు.. చలి నుండి రక్షించుకోవడానికి నిశ్శబ్దంగా ఆ కోతి హీటర్ ముందు కూర్చుని ఉంది.. ఇదిలా ఉండగా ఆఫీస్ లో పనిచేస్తున్న పోలీస్ సిబ్బంది అక్కడకు వచ్చారు.. వారు కూడా మానవత్వంతో ఆ కోతిని ఏమి అనకుండా వదిలిపెట్టారు.. పైగా ఆ కోతిని ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు.
सर्दी से ठिठुरता एक बंदर जब अचानक पुलिस कमिश्नर कैम्प कार्यालय के अंदर घुस आया और हीटर के सामने आकर बैठ गया तो ड्यूटी पर तैनात SIअशोक कुमार गुप्ता ने उसकी परेशानी समझ कर बैठे रहने दिया और प्यार से सहलाया भी थोड़ी देर बाद बन्दर भी बिना कुछ नुकसान पहुंचाये आराम से चला गया।#UPPCares pic.twitter.com/8X9zvxX856
— POLICE COMMISSIONERATE KANPUR NAGAR (@kanpurnagarpol) January 18, 2024
ఈ విషయం పోలీస్ కమిషనరేట్ కాన్పూర్ నగర్‌కు చెందినదిగా తెలిసింది.. ఈ వీడియోను ఉత్తరప్రదేశ్ పోలీసులు మైక్రోబ్లాగింగ్ సైట్ ఎక్స్‌లో షేర్ చేశారు. ఈ వీడియోను పోస్ట్ చేస్తున్నప్పుడు యుపి పోలీసులు క్యాప్షన్‌లో రాశారు – చలితో వణుకుతున్న కోతి అకస్మాత్తుగా పోలీసు కమిషనర్ క్యాంపు కార్యాలయంలోకి ప్రవేశించి హీటర్ ముందు కూర్చున్నప్పుడు, డ్యూటీలో ఉన్న ఎస్‌ఐ అశోక్ కుమార్ గుప్తా ఆ మూగజీవి సమస్యను అర్థం చేసుకున్నారు. అందుకే దాన్ని ప్రేమగా లాలించి, కొంతసేపటి తర్వాత కోతి కూడా ఎలాంటి హాని కలిగించకుండా ప్రశాంతంగా వెళ్లిపోయింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి