Viral Video: కోతికి కోపం వస్తే ఇలాగే ఉంటుంది మరి.. ఇచ్చి పడేసిందిగా..

సోషల్ మీడియాలో ఓ కోతికి, బాలికకు సంబంధించిన ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా షాక్‌కి గురవుతారు. అలాగే నవ్వుతారు కూడా. ఓ జూలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పెద్ద బోనులో ఉండే కోతులను చూసేందుకు చాలా మంది నిలబడి ఉన్నారు. ఇంతలో ఓ బాలిక.. ఇనుప ఊచల దగ్గరకు వెళ్లి కోతిని వీడియో తీస్తోంది. అయితే ఆ కోతిని చేతితో తరిమి కొడుతుంది. అప్పటి వరకూ ఫొటోలకు..

Viral Video: కోతికి కోపం వస్తే ఇలాగే ఉంటుంది మరి.. ఇచ్చి పడేసిందిగా..
Viral Video
Follow us
Chinni Enni

|

Updated on: Aug 15, 2024 | 2:09 PM

సోషల్ మీడియాలో ఓ కోతికి, బాలికకు సంబంధించిన ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా షాక్‌కి గురవుతారు. అలాగే నవ్వుతారు కూడా. ఓ జూలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పెద్ద బోనులో ఉండే కోతులను చూసేందుకు చాలా మంది నిలబడి ఉన్నారు. ఇంతలో ఓ బాలిక.. ఇనుప ఊచల దగ్గరకు వెళ్లి కోతిని వీడియో తీస్తోంది. అయితే ఆ కోతిని చేతితో తరిమి కొడుతుంది. అప్పటి వరకూ ఫొటోలకు ఫోజులు ఇచ్చిన ఆ కోతికి కోపం వచ్చినట్టు ఉంది. వెంటనే అక్కడున్న బాలిక జుట్టు పట్టుకుంది. విడిపించినా కూడా వదలకుండా గట్టిగా పట్టుకుంది. దీంతో అక్కడున్న వారందరూ షాక్‌కి గురయ్యారు.

ఆ కోతి నుంచి విడిపించు కోవడానికి ట్రై చేసినా.. ఆ కోతి బాలిక జుట్టును విడిచి పెట్టడం లేదు. దీంతో అక్కడున్న వారు బాలిక జుట్టును కోతి నుంచి విడిపించారు. అయినా ఆ కోతికి కోపం తగ్గ లేదనుకుంటా.. అలాగే ఆ కోతిని పట్టుకుని దగ్గరకు లాగుతుంది. అప్పటి వరకూ హ్యాపీగా ఉన్న బాలిక.. ఒక్కసారిగా బిక్క ముఖం వేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా రియాక్ట్ అవుతున్నారు.

బాబాయ్.. ‘కోతికి కోపం వస్తే ఇలాగే ఉంటుందేమో’.. ‘కోతి ముందు పిచ్చి చేష్టలు వేస్తే అంతే’.. ‘అయ్యో పాపం బుజ్జి తల్లి భయపడినట్టు ఉంది’.. ‘కోతులతో చాలా జాగ్రత్తగా ఉండాలి’.. ‘వాళ్ల తల్లిదండ్రులు ఏం చేస్తున్నారో’.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ వీడియోకు 7 లక్షలకు పైగా వీడియోస్ వచ్చాయి.