
ఇటీవల సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించిన అనేక రకాల వీడియోస్ వైరలవుతున్నాయి. అందులో క్రూరమృగాలు.. పెంపుడు జంతువులకు చెందినవి అనేకం. అయితే వాటిలో కొన్ని వీడియోస్ నవ్వులు తెప్పిస్తాయి. మరికొన్ని వెన్నులో వణుకుపుట్టిస్తాయి. ఇటీవల సింహాలు, పులులకు చెందిన వీడియోలు నెట్టింట చక్కర్లు కోడుతున్నాయి. తాజాగా వాటికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతుంది. అడవిలో విడిది చేయడం వలన కొన్నిసార్లు ప్రమాదం ఎదుర్కోవాల్సి వస్తుంది. క్యాంపింగ్ చేస్తున్న సమయంలో ప్రమాదకరమైన జంతువులు ఎదురుపడతాయి.
తాజా వీడియోలో ఒక వ్యక్తి తాళ్ల సహాయంతో చెట్టుపైకి ఎక్కుతున్నట్లు కనిపిస్తోంది. అదే సమయంలో ఆ చెట్టు పక్క చెట్టు మీద సింహం ఉంది. అది గమనించిన వ్యక్తి చెట్టు ఎక్కడం ఆపేసి అక్కడే నిల్చున్నాడు. అతడి చూసిన ఆ సింహం పెద్ద గర్జిస్తూ అతడిపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తుంది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరలవుతుంది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.