Optical Illusion: ఇది మామూలు ఛాలెంజ్ కాదు.. ఈ ఫొటోలోని పిల్లిని కనుక్కుంటే మీరు తోపులే..

|

Jul 05, 2022 | 4:21 PM

అందుకే ఎప్పుడూ కూడా ఆప్టికల్ ఇల్యూజన్స్ ఫోటోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కానీ ప్రస్తుతం పైన కనిపిస్తున్న ఫోటో మాత్రం వాటన్నింటికి భిన్నం. ఎందుకంటే ఇందులో మీ మెదడుకు పని చెప్పాల్సి ఉంటుంది.

Optical Illusion: ఇది మామూలు ఛాలెంజ్ కాదు.. ఈ ఫొటోలోని పిల్లిని కనుక్కుంటే మీరు తోపులే..
Optical Illusion
Follow us on

Optical Illusion: ఆప్టికల్ ఇల్యూజన్స్.. చాలా ఆసక్తికరంగా.. సరదాగా ఉంటాయి. ఏదైనా గుర్తించడానికి.. మనం చూసే విధానాన్ని, గమనించే తీరును, మన స్వభావాన్ని వీటి ద్వారా తెలుసుకోవచ్చు. అందుకే ఎప్పుడూ కూడా ఆప్టికల్ ఇల్యూజన్స్ ఫోటోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కానీ ప్రస్తుతం పైన కనిపిస్తున్న ఫోటో మాత్రం వాటన్నింటికి భిన్నం. ఎందుకంటే ఇందులో మీ మెదడుకు పని చెప్పాల్సి ఉంటుంది. అయితే సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న ఓ పజిల్ నెటిజన్ల మనసు దోచుకునేలా చేస్తోంది. పచ్చికబయళ్లతో సుందరంగా కనిపిస్తున్న ఈ చిత్రంలో ఒక పిల్లి చాలా దాక్కుని ఉంది. దీనిని గుర్తించడం చాలా కష్టంగా మారింది. నిజం చెప్పాలంటే ఇది మీకు పెద్ద సవాలులాంటింది. ఈ ఫోటోను జాగ్రత్తగా పరిశీలిస్తే కాని గుర్తించడం అంత సాధ్యం కాదు..

ఈ చిత్రాన్ని There is no cat in this image అనే పేజీ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. గ్రీనరీతో ఉన్న ఈ ఫోటోలో పెరడు, చక్రాల బండి, షెడ్, కంచె, లాంజ్ ప్రాంతం ఉన్నాయి. అయితే, ఒక పిల్లి పెరట్లో ఖచ్చితంగా ఒకచోట దాక్కుని ఉంది. దానిని కనిపెట్టండి అంటూ పోస్ట్ చేశారు. ఇది ఇంటర్నెట్‌ను విపరీతంగా షేక్ చేస్తోంది.

ఇవి కూడా చదవండి

ఫొటో ఒకసారి చూడండి..

ఆప్టికల్ ఇల్యూషన్ ఆన్‌లైన్‌లో చాలా మంది దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంగ్లాండ్‌లోని బ్రాడ్‌ఫోర్డ్‌లో నివసించే రికీ అనే పిల్లిని గుర్తించడానికి నెటిజన్లు చాలా పోటీ పడ్డారు. కొంతమంది వినియోగదారులు దీన్ని కనుగొనగలిగితే, మరికొందరు చాలా కష్టంగా ఉందని భావించి వెనుతిరిగారు.

మీరు పిల్లిని గుర్తించగలిగారా? గుర్తించకపోతే ఇక్కడ తెలుసుకోండి.. రికీ (పిల్లి) యజమాని లీ ఒమన్.. పిల్లి చక్రాల బండి, షెడ్ మధ్య దాగి ఉందని పేర్కొన్నారు. అయితే.. ఈ ఫొటోలో పిల్లి తోక మాత్రమే కనిపిస్తోంది.

Optical Illusion

పిల్లి మొత్తం కనిపించకపోవడంతో చాలామంది తికమకపడుతూ.. ఏక్కడ దాగుందో తెలిదంటూ పేర్కొంటున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.