Video Viral: పుట్టింటికి వెళ్తే కనీసం నెల ఉండాల్సిందే.. వరుడి సమాధానం విని పడీపడీ నవ్విన అతిథులు
సోషల్ మీడియాలో (Social Media) ప్రతి రోజు ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. పెళ్లికి సంబంధించిన ఫన్నీ వీడియోలు ఎప్పటికీ ఇంటర్నెట్‌లో ట్రెండ్ (Trending) అవుతూనే ఉంటాయి. వధూవరులు తమ వివాహాన్ని ప్రత్యేకంగా నిలపడం కోసం రకరకాల....
సోషల్ మీడియాలో (Social Media) ప్రతి రోజు ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. పెళ్లికి సంబంధించిన ఫన్నీ వీడియోలు ఎప్పటికీ ఇంటర్నెట్‌లో ట్రెండ్ (Trending) అవుతూనే ఉంటాయి. వధూవరులు తమ వివాహాన్ని ప్రత్యేకంగా నిలపడం కోసం రకరకాల పనులు చేస్తుంటారు. వివాహానికి ముందు అనేక ఆచారాలు, సంప్రదాయాలు జరుగుతుంటాయి. పెళ్లిలో పురోహితుడు వధూవరులతో ఎన్నో పనులు చేయిస్తూ ఉంటారు. ఇలా పురోహితుడు ఓ విషయం అడగగానే వరుడు చెప్పిన సమాధానం విని అక్కడ ఉన్న వారందరూ పడీపడీ నవ్వుకున్నారు. పుట్టింటికి వెళ్లాలనుకుంటే భర్త అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని పురోహితుడు వధువుతో చెప్తాడు. దీనికి వరుడు తాను ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్లొచ్చు.. కానీ ఒక షరతు ఉందన్నాడు. ఎప్పుడు ఎక్కడికి వెళ్లినా ఒక నెల కంటే తక్కువ సమయం ఉండకూడదని చెప్పతాడతు. పెళ్లి కొడుకు మాటలు విన్న అక్కడున్న వాళ్లందరూ పడీపడీ నవ్వారు.
ఈ వీడియోను వెడ్డింగ్ ప్లిజ్ అనే ఖాతా ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఈ వీడియోను ఇప్పటి వరకు ఏడు లక్షల మందికి పైగా లైక్ చేశారు. పలువురు వాట్ ఏ ఫన్నీ వెడ్డింగ్ అని, వరుడి సమాధానం మనసు దోచుకుందని, అతడికి కాబోయే భార్యపై ఎంత ప్రేమ ఉందో తెలుస్తోందని కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి