AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భూమిపై దేవుని కళ్లు.. ప్రకృతి సృష్టించిన ఈ అద్బుతాన్ని చూస్తే అవాక్కవ్వాల్సిందే..

ప్రకృతిలోని వింతలు, విశేషాలు ఎప్పుడూ మానవుడిని విస్మయానికి గురిచేస్తూనే ఉంటాయి. తాజాగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఒక రహస్య గుహ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షిస్తోంది. దేవుని కళ్లుగా పిలిచే ఈ అద్భుతమైన భౌగోళిక వింత ఎక్కడుంది? దీని వెనుక ఉన్న చారిత్రక సీక్రెట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

భూమిపై దేవుని కళ్లు.. ప్రకృతి సృష్టించిన ఈ అద్బుతాన్ని చూస్తే అవాక్కవ్వాల్సిందే..
Eyes Of God Cave In Bulgaria
Krishna S
|

Updated on: May 23, 2026 | 4:34 PM

Share

ప్రకృతి చూపించే వింతలు, విశేషాలు ఎప్పుడూ మనుషులను అబ్బురపరుస్తూనే ఉంటాయి. అలాంటి ఒక అద్భుతమైన, రహస్యమయమైన గుహ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తోంది. మొదటి చూపులోనే ఏదో హాలీవుడ్ సినిమా సీన్ లాగానో, లేదా ఒక గొప్ప చిత్రకారుడి ఊహ లాగానో కనిపించే ఈ గుహ… అందమైన యూరోపియన్ దేశమైన బల్గేరియాలో ఉంది. ప్రజలు దీనిని ఎంతో భక్తితో, ఇష్టంతో దేవుని కళ్లు అని పిలుచుకుంటారు. ఈ గుహ పైకప్పు భాగంలో అచ్చం మనిషి కళ్లలాగే ఉండే రెండు పెద్ద గుండ్రని రంధ్రాలు ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డాయి. ఈ రంధ్రాల గుండా సూర్యరశ్మి లోపలికి ప్రవేశించినప్పుడు.. ఆకాశమే నేరుగా భూమిలోకి తొంగి చూస్తోందా అనే భ్రమ కలుగుతుంది. ఈ అద్భుత దృశ్యాన్ని కళ్లారా చూసేందుకు ప్రతి సంవత్సరం వేలాది మంది పర్యాటకులు ఇక్కడికి తరలివస్తుంటారు.

ఎక్కడ ఉంది? దీని అసలు కథ ఏంటి?

బల్గేరియా రాజధాని సోఫియా నుండి సుమారు రెండు గంటల ప్రయాణ దూరంలో లుకోవిట్ ప్రాంతంలోని ‘కార్లుకోవో’ గ్రామానికి సమీపంలో ఈ గుహ ఉంది. దీని అధికారిక పేరు ప్రోహోడ్నా గుహ. ఇది బల్గేరియాలోని అతిపెద్ద కార్స్ట్ ప్రాంతాలలో ఒకటి. వేల సంవత్సరాలుగా సున్నపురాయి శిలలు నీరు, గాలి చర్యల వల్ల నెమ్మదిగా కరిగిపోవడం వల్ల ఈ గుహ ఏర్పడింది. భూమి చరిత్రలోనే అత్యంత పిన్న వయస్సు గల భౌగోళిక కాలమైన క్వాటర్నరీ కాలంలో ఇది ఏర్పడిందని చరిత్రకారులు చెబుతున్నారు. సుమారు 880 అడుగుల పొడవున్న ఈ గుహలో ప్రాచీన మానవ నివాసాల ఆనవాళ్లు కూడా లభించాయి.

సాహస ప్రియుల స్వర్గధామం

ఈ గుహ కేవలం ప్రకృతి ప్రేమికులను మాత్రమే కాకుండా సాహస వీరులను కూడా ఆకట్టుకుంటోంది. గుహ యొక్క ప్రధాన ప్రవేశ ద్వారం సుమారు 148 అడుగుల ఎత్తులో ఉంటుంది. అందువల్ల ఇక్కడ బంజీ జంపింగ్, రాక్ క్లైంబింగ్ వంటి సాహస క్రీడలు విరివిగా జరుగుతుంటాయి. అంత ఎత్తు నుండి గుహ లోపలికి దూకుతున్నప్పుడు కలిగే థ్రిల్ పర్యాటకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది.

సినిమా షూటింగ్స్‌తో గ్లోబల్ క్రేజ్

ఈ గుహ అందాలు కేవలం పర్యాటకానికే పరిమితం కాలేదు వెండితెరను కూడా శాసించాయి. 1988లో వచ్చిన ప్రసిద్ధ బల్గేరియన్ చిత్రం టైమ్ ఆఫ్ వయలెన్స్ లోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను ఈ గుహలోనే చిత్రీకరించారు. ఆ సినిమా విడుదల తర్వాతే ఈ ‘దేవుని కళ్ళు’ ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన గుర్తింపును తెచ్చుకున్నాయి. ప్రకృతి వైవిధ్యాన్ని, చరిత్రను, సాహసాన్ని ఒకేచోట చూడాలనుకునే వారికి ఈ ప్రోహోడ్నా గుహ ఒక పర్ఫెక్ట్ డెస్టినేషన్ అని చెప్పక తప్పదు.

Follow Us
భూమిపై దేవుని కళ్లు.. ప్రకృతి సృష్టించిన ఈ అద్బుతాన్ని చూస్తే..
భూమిపై దేవుని కళ్లు.. ప్రకృతి సృష్టించిన ఈ అద్బుతాన్ని చూస్తే..
ఈ ఎండల్లోనూ వేడివేడి టీ వదలట్లేదా? మీ బాడీలో జరిగేదిదే..
ఈ ఎండల్లోనూ వేడివేడి టీ వదలట్లేదా? మీ బాడీలో జరిగేదిదే..
Video: ఇది రా రోహిత్ అంటే.. లేడీ ఫ్యాన్‌కి సారీ చెబుతూ వీడియో
Video: ఇది రా రోహిత్ అంటే.. లేడీ ఫ్యాన్‌కి సారీ చెబుతూ వీడియో
చనిపోయిన మనిషి ఆత్మ రాత్రి పూట ఇంట్లోనే తిరుగుతుందా?
చనిపోయిన మనిషి ఆత్మ రాత్రి పూట ఇంట్లోనే తిరుగుతుందా?
అదృష్టం అంటే ఇదేనేమో..రూ.1 లక్షను రూ.21 కోట్లు చేసిన మల్టీబ్యాగర్
అదృష్టం అంటే ఇదేనేమో..రూ.1 లక్షను రూ.21 కోట్లు చేసిన మల్టీబ్యాగర్
ఒరేయ్.. పోతార్రరేయ్.. కదులుతున్న రైలు కింద నుంచి దూరటం ఏంట్రా?
ఒరేయ్.. పోతార్రరేయ్.. కదులుతున్న రైలు కింద నుంచి దూరటం ఏంట్రా?
Weekly Horoscope: ఇక ఆ రాశి ఉద్యోగులకు గోల్డెన్ డేస్..!
Weekly Horoscope: ఇక ఆ రాశి ఉద్యోగులకు గోల్డెన్ డేస్..!
బిగ్ అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో మే 28న సెలవు.. ఎందుకంటే..
బిగ్ అలర్ట్.. తెలుగు రాష్ట్రాల్లో మే 28న సెలవు.. ఎందుకంటే..
పెళ్లికి ఖాళీ చేతులతో ఎందుకు వెళ్లకూడదు? అసలు నిజం తెలిస్తే..
పెళ్లికి ఖాళీ చేతులతో ఎందుకు వెళ్లకూడదు? అసలు నిజం తెలిస్తే..
విజేతకే కాదు.. రన్నరప్‌తోపాటు ఆ జట్లపైనా కాసుల వర్షం.. !
విజేతకే కాదు.. రన్నరప్‌తోపాటు ఆ జట్లపైనా కాసుల వర్షం.. !