కొన్ని సంవత్సరాల క్రితం వరకూ ఎవరైనా సరే కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు తమకు కావాలిన వారి అడ్రెస్ లేదా తగిన సమాచారాన్ని ఆయా ప్రాంతాలకు చెందిన వ్యక్తులను అడిగి తెలుసుకునేవారు. తమ గమ్యాన్ని క్షేమంగా చేరుకునేవారు. అయితే కాలంలో వచ్చిన సాంకేతిక మార్పుల్లో భాగంగా ప్రపంచం మొత్తం అరచేతిలోనే దర్శనం ఇస్తుంది. ఉన్న చోటు నుంచి గమ్యస్థానికి ఏ విధంగా చేరుకోవాలి తెలియజేస్తూ సిస్టం కూడా అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ GPS సిస్టమ్‌పై ఆధారపడి గుడ్డిగా వెళ్తే కొన్ని సార్లు ప్రమాదాలు లేదా కష్టాలు తప్పవంటూ ఇటీవల కొన్ని సంఘటనలు రుజువు చేస్తున్నాయి. తాజాగా థాయ్ లాండ్ కి చెందిన ఓ మహిళ తన స్నేహితురాలిని కలవడం కోసం జీపీఎస్ సిస్టమ్ ను నమ్ముకుని అష్టకష్టాలు పడింది. అతి కష్టము మీద ప్రాణాలను, కారుని దక్కించుకుంది. వివరాల్లోకి వెళ్తే..
థాయ్‌లాండ్‌లోని 38 ఏళ్ల ఒక మహిళ తన స్నేహితురాలిని కలుసుకోవడానికి తెల్లటి హోండా సెడాన్ కారులో ప్రయాణం చేయడం మొదలు పెట్టింది. అయితే తాను ప్రయాణించే మార్గంలోని పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా GPS సహాయంతో ప్రయాణిస్తూ.. నదిని దాటడం కోసం ఒక చెక్క వంతెన పై కారుతో ప్రయాణం చేయడం మొదలు పెట్టింది. ఇలా వంతెనపైకి దాదాపు 15 మీటర్ల దూరం వరకూ కారులో వెళ్లిన తర్వాత ఆ కారు ముందు ఎడమ చక్రం చెక్క బ్రిడ్జ్ లో చిక్కుకుంది . ఈ సంఘటన జనవరి 28న సాయంత్రం 5:40 గంటల ప్రాంతంలో వియాంగ్ థాంగ్ బ్రిడ్జ్ మధ్యలో చోటు చేసుకుంది.
అయితే అదే సమయంలో బ్రిడ్జిని దాటబోతున్న పాసర్ మకున్ ఇంచాన్ అనే వ్యక్తి బిడ్జిలో కూరుకుపోయిన కారుని గమనించారు. అదే సమయంలో సహాయం కోసం పిలుస్తున్న మహిళ మాటలను విని.. అక్కడ పరిస్థితి ని అంచనావేశారు. ఇంచాన్ తక్షణమే అత్యవసర సేవల చేసే బృందానికి పరిస్థితిని తెలియజేశాడు. వారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
In a story going viral nationally, a #Thai woman ended up stranded above the Yom River in Phrae after she claims the GPS told her to cross this tiny pedestrian bridge with her car and she said she believed the device. She said it wasn't her fault.https://t.co/H2kx2zj5Aq pic.twitter.com/QC91v8kPmQ
— The Pattaya News Thailand (@The_PattayaNews) January 29, 2024
కూరుకుపోయిన వాహనాన్ని మరింత నష్టం జరగకుండా రక్షించేందుకు చర్యలు ప్రారంభించారు. హోండా సెడాన్‌ను సురక్షితంగా వెనక్కి లాగేందుకు రెండు ట్రాక్టర్లను ఉపయోగించారు. ఈ ఆపరేషన్ విజయవంతమైంది. ఆ మహిళ వాహనం వంతెన నుండి సురక్షితంగా వెనక్కి తీసుకుని వచ్చారు.
120-మీటర్ల పొడవైన ఈ వంతెన చాలా ఇరుకుగా ఉంటుంది. అంతేకాదు ఈ వంతెన సుమారు 40 సంవత్సరాల క్రితం నిర్మించబడింది. వాస్తవానికి పాదచారుల కోసమే నిర్మించారు. ఇతరులను హెచ్చరించేందుకు స్పష్టమైన హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను పాసర్ మకున్ ఇంచాన్ కోరారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..