Viral Video: నీటి కుంటలో వింత ఆకారం.. కెమెరా జూమ్ చేయగా.. అమ్మ బాబోయ్..!
సోషల్ మీడియా ప్రపంచంలో ఎన్నో రకాల వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతుంటాయి.. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని భయంకరంగా ఉంటాయి.. వీటిని చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తంచేయడంతోపాటు.. పలు రకాల కామెంట్లు చేస్తుంటారు. ఇంకా వాటిని షేర్ చేసి.. మిత్రులకు పంచుకుంటారు.. ముఖ్యంగా నెట్టింట వైరల్ అయ్యే వాటిల్లో జంతువులకు సంబంధించినవే ఎక్కువగా ఉంటాయి..

సోషల్ మీడియా ప్రపంచంలో ఎన్నో రకాల వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతుంటాయి.. వాటిలో కొన్ని ఫన్నీగా.. మరికొన్ని భయంకరంగా ఉంటాయి.. వీటిని చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తంచేయడంతోపాటు.. పలు రకాల కామెంట్లు చేస్తుంటారు. ఇంకా వాటిని షేర్ చేసి.. మిత్రులకు పంచుకుంటారు.. ముఖ్యంగా నెట్టింట వైరల్ అయ్యే వాటిల్లో జంతువులకు సంబంధించినవే ఎక్కువగా ఉంటాయి.. ముఖ్యంగా పాములు, పలు రకాల వన్యమృగాలకు చెందినవి ఉంటాయి.. వాటిలో కొన్ని నెటిజన్ల మనస్సు దోచుకుంటాయి.. అయితే.. తాజాగా.. నెట్టింట ఓ వీడియో షాక్‌కు గురిచేస్తోంది.. నీటిలో ఉన్న రూపాన్ని చూసి నెటిజన్లు భయపడుతున్నారు.. కొంప దీసి దాని నోటికి చిక్కితే అంతేసంగతులు.. ఎందుకంటే.. దాని పళ్లు భయంకరంగా ఉన్నాయి.. అది గాని కొరికిందంటే.. మటాషే.. అదేంటో అనుకుంటున్నారా..? మొసలి.. భయంకరమైన మొసలి వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో.. నెటిజన్లు షాకవుతున్నారు.
నీటి కుంటలో మొసలి.. నోరు తెరిచి పైకి వస్తున్న వీడియోను Nature is Amazing (@AMAZlNGNATURE) అనే యూజర్ ఎక్స్‌లో షేర్ చేసింది.. దీనిలో 5 మిలియన్ డాలర్లకు, మీరు ఈ నీటిలో దూకుతారా? అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది.. దీనిలో మొసలి .. నీటి అడుగు భాగం నుంచి నోరు తెరిచి పైకి తేలుతూ వస్తుంది.. అయితే.. ముందుగా దాని పదునైన పళ్లు మాత్రమే కనిపిస్తాయి.. కెమెరా జూమ్ చేసి చూస్తే కానీ.. దాని రూపం కనిపిస్తుంది..
వీడియో చూడండి..
For 5 Million dollars, would you jump into this water? pic.twitter.com/GByp3kLcGf
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) August 11, 2024
అయితే.. ఈ వీడియో ఎక్కడ తీసింది.. ఏంటి..? అనే వివరాలను మాత్రం పంచుకోలేదు.. కానీ.. ఇది మాత్రం నెట్టింట హల్ చల్ చేస్తోంది.. వేలాది మంది ఈ వీడియోను వీక్షించి పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. మొసలి ఇంత భయంకరంగా ఉంటుందా అంటూ నెటిజన్లు కామెంట్లు చేయడంతోపాటు.. దాని జోలికి అస్సలు పొవద్దు అంటూ సలహాలు ఇస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
