Maldives: డైవింగ్ కోసమని నీటిలోకి వెళ్లారు..ఇంతలోనే సొరచేప వచ్చి ఏం చేసిందంటే

|

Apr 15, 2023 | 1:11 PM

సముద్రంలో లోపల డైవింగ్ చేసేందుకు కొంతమంది ఆసక్తి చూపుతుంటారు. కానీ కొన్ని సందర్బాల్లో సొరచేపల దాడులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. తాజాగా అలాంటి ఘటనే మాల్దీవుల్లో జరిగింది.

Maldives: డైవింగ్ కోసమని నీటిలోకి వెళ్లారు..ఇంతలోనే సొరచేప వచ్చి ఏం చేసిందంటే
Cervello
Follow us on

సముద్రంలో లోపల డైవింగ్ చేసేందుకు కొంతమంది ఆసక్తి చూపుతుంటారు. కానీ కొన్ని సందర్బాల్లో సొరచేపల దాడులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. తాజాగా అలాంటి ఘటనే మాల్దీవుల్లో జరిగింది. కెర్వెల్లో(30) అలాగే ఆమె స్నేహితుడు ఇబ్రహీం షఫీజ్ (37) లు మాల్దీవుల అందాల్ని చూసేందుకు వచ్చారు. అనంతరం వాళ్లిద్దరూ నీటిలో డైవింగ్ చేసేందుకు వెళ్లారు. కొద్దిసేపు డైవింగ్ చేశాక.. 220 పౌండ్ల బరువు, 8 అడుగుల పొడవున్న ఓ సొరచేప కెర్వెల్లో భూజాన్ని కొరికింది. దీంతో ఆమె భూజానికి ఆరు ఇంచుల వరకు గాయమయ్యింది.

దీంతో వాళ్లిద్దరు ఒక్కసారిగా నీటి నుంచి బయటకు వచ్చేశారు. ఆ గాయాన్ని పరిశీలించారు. కానీ కెర్వెల్లో మాత్రం ఆ గాయం చిన్నదే అని భావించింది. మళ్లీ వాళ్లిద్దరు సొరచేపలతో డైవింగ్ చేసేందుకు నీటీలోకి వెళ్లారు. అయితే ఈ దాడి జరగకముందు వీళ్లిద్దరు 45 నిమిషాల పాటు సొరచేపలతోనే స్వేచ్చగా ఈదారు. ఇబ్రహీం షాహెబ్ సొరచేపలను వారి డైవింగ్‌ను తన కెమెరాలో చిత్రీకరిస్తుండాగా కార్వెల్లోను సొరచేప గాయపర్చిన వీడియో అందులో రికార్డు అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి