Viral Video: దేవుడా నువ్వే కాపాడాలి..! దీపావళి రోజున ఎలుక మొక్కులు.. వీడియో వైరల్

ప్రస్తుతం ఒక ఎలుక ప్రత్యేకమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది సంచలనం సృష్టిస్తోంది. ఈ ఎలుక భగవంతుడి ముందు భక్తితో మొకరిల్లుతోంది. మనుషులు రెండు చేతులతో దండపెట్టినట్టుగా ఎలుక కూడా తన ముందు రెండు కాళ్లతో దండం పెడుతోంది. ఎలుక భక్తికి సంబంధించిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర సంచలనం రేపుతోంది.

Viral Video: దేవుడా నువ్వే కాపాడాలి..! దీపావళి రోజున ఎలుక మొక్కులు.. వీడియో వైరల్
Rat Praying Temple

Updated on: Oct 23, 2025 | 5:42 PM

సోషల్ మీడియాలో ఎప్పుడు ఎలాంటి వీడియో, వార్త వైరల్ అవుతుందో చెప్పలేము. ప్రతి రోజూ వేలాది వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. అందులో చాలా వరకు జంతువుల వీడియోలు ఉంటాయి. కుక్కలు, పిల్లలు వంటి పెంపుడు జంతువులు ఇంట్లో వారి అనుకరిస్తూ, వారు చెప్పిన పనులు చేస్తుంటాయి. కానీ, ఎలాంటి ప్రాక్టీస్‌ లేకుండా అప్పుడప్పుడు కొన్ని జంతువులు వింతగా ప్రవర్తిస్తుంటాయి. ప్రస్తుతం ఒక ఎలుక ప్రత్యేకమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది సంచలనం సృష్టిస్తోంది. ఈ ఎలుక భగవంతుడి ముందు భక్తితో మొకరిల్లుతోంది. మనుషులు రెండు చేతులతో దండపెట్టినట్టుగా ఎలుక కూడా తన ముందు రెండు కాళ్లతో దండం పెడుతోంది. ఎలుక భక్తికి సంబంధించిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర సంచలనం రేపుతోంది.

ఎలుకను గణపతి వాహనంగా పిలుస్తారు. ఆయనతో పాటు అన్ని సందర్భాల్లో ఎలుక కూడా తొలి పూజను అందుకుంటుంది. చిట్టెలుక వినాయకుడికి వాహనంగా మారి ఆయనతో పాటు తొలి పూజను అందుకుంటోంది. అలాంటి ఎలుకకు ఏం కష్టం వచ్చిందో ఏమోగానీ, భగవంతుడిని కాకపడుతోంది. దాని ముందు కాళ్లను పైకి లేపి దండం పెడుతున్న భంగిమలో నిలబడి వంగి వంగి మొక్కుతోంది. కొన్నిసార్లు చప్పట్లు కొడుతున్నట్లు కనిపిస్తుంది. ఇదంతా వీడియో తీసిన కొందరు స్థానికులు సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు. దాంతో ఎలుక భక్తితో కూడిన సంజ్ఞను చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. అయితే, ఈ వైరల్ వీడియో ఉత్తరప్రదేశ్ కు చెందినదిగా తెలిసింది.

ఇవి కూడా చదవండి

సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ 29 సెకన్ల వీడియోను @deep90writer షేర్ చేశారు. ఎలుక భక్తి వీడియోను షేర్ చేస్తూ దీప్ పాండే ఇలా రాశారు, కాస్‌గంజ్‌లోని ఒక గుడిలో దేవుడి ముందు భక్తి భంగిమలో ఒక ఎలుక కనిపించింది. వీడియోలో, అది చేతులు ముడుచుకుని చప్పట్లు కొడుతోంది.

వీడియో ఇక్కడ చూడండి..

ఈ వీడియో సోషల్ మీడియాలో కనిపించగానే వైరల్ అయింది. దీనిని వేలాది మంది వీక్షించారు. ప్రజలు దీనికి రకరకాల కామెంట్స్‌ వ్యక్తం చేస్తున్నారు. ఈ దృశ్యం ప్రజల విశ్వాసం, కరుణపై కొత్త దృక్పథాన్ని అందిస్తుందని అన్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..