భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని(MS Dhoni) అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చి చాలా కాలం గడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే, అతని ఫ్యాన్ ఫాలోయింగ్ ఇప్పటికీ చెక్కుచెదరలేదు. ధోనీ అంటే పిచ్చి ఇండియాలోనే కాదు విదేశాల్లోనూ ఉంటుందనడంలో సందేహం లేదు. అందుకు సాక్ష్యంగా తాజాగా ఓ వీడియోను చూడొచ్చు. ధోనీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో, ధోని లండన్ వీధుల్లో తిరుగుతున్నట్లు చూడొచ్చు. అతనితో పాటు చాలా మంది అభిమానులు కూడా అతనిని అనుసరిస్తున్నట్లు వీడియోలొ చూడొచ్చు. అభిమానులు ధోనితో సెల్ఫీ దిగేందుకు అతని వెంట పరుగులు తీస్తున్నారు. ఈ వీడియోలో కొందరు వ్యక్తులు ధోనీతో పరుగెత్తుకుంటూ సెల్ఫీలు దిగుతున్న దృశ్యాలు కూడా వీడియోలో కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం ధోనీ ఇంగ్లాండ్‌లో ఉన్నాడు. ఇండియా-ఇంగ్లండ్ మ్యాచ్ సందర్భంగా కూడా ధోని స్టేడియంలో కనిపించి, సందడి చేశాడు. బీసీసీఐ ధోని ఫొటోలను పంచుకుంది. అందులో అతను భారత యువ ఆటగాళ్ళు, సిబ్బందితో సంభాషిస్తున్నట్లు కనిపించింది.
MS Dhoni in the streets of London ❤️?#MSDhoni pic.twitter.com/FWPu0sMBpJ
— Chakri Dhoni (@ChakriDhoni17) July 15, 2022
2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు ధోనీ వీడ్కోలు పలికాడు. వన్డేల్లో ధోనీ పేరిట 10 వేలకు పైగా పరుగులు ఉన్నాయి. అతను ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకడిగా పేరుగాంచాడు. అతని కెప్టెన్సీలో భారత్ టీ20 ప్రపంచకప్, వన్డే ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ వంటి టైటిల్స్ గెలుచుకుంది. ప్రస్తుతం ధోనీ ఐపీఎల్ టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా ఉన్నాడు.