క్లాసులో రకరకాల పిల్లలు ఉంటారు. చదువంటే చాలా ఆసక్తి ఉన్న స్టూడెంట్స్ కొందరు ఉంటే, మరికొందరు అతి తెలివి గల స్టూడెంట్స్ మరికొందరు ఉంటారు. అయితే మరికొందరికి టీచర్ల నుంచి కొంచెం వివరణ ఇచ్చిన తర్వాతే అన్నీ అర్థమవుతాయి. కొంతమంది విద్యార్థులు నార్మల్ తెలివితేటలున్నా కూడా తమ పనిని చక్కగా చేస్తారు. కొంతమంది విద్యార్థులు తమ హృదయ పూర్వకంగా లేదా మనస్సు పెట్టి చదవరు. అలాంటి స్టూడెంట్ కు సంబంధించిన ఒక ఆన్సర్ షీట్ ఒకటి ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది. ఇది చూస్తే ఎవరైనా సరే నవ్వాల్సిందే.. అంత ఫన్నీగా రాశాడు ఆ స్టూడెంట్..
స్టూడెంట్ కు ఇయర్ మొదలైతే చాలు యూనిట్స్, క్వాటర్లీ, అర్ధ సంవత్సర పరీక్షలు వంటివి వస్తూ పోతూనే ఉంటాయి. అయితే కొంతమంది పరీక్ష పాస్ అవ్వాలని.. మంచి మార్కులు రావాలని కోరుకుంటూ రాస్తారు. అయితే మరి కొందరు స్టూడెంట్స్ టైం పాస్ కోసం తమకు నచ్చిన మనసు మెచ్చిన సమాధానాలను పత్రంపై వ్రాస్తారు. ఇవి గుర్తుండిపోతాయి. కొంతకాలం క్రితం ‘పుష్ప: ది రైజ్’ చిత్రంలో అల్లు అర్జున్ మాట్లాడిన పుష్పా.. పుష్పా రాజ్ అంటూ చెప్పిన డైలాగ్‌ను రాసిన విద్యార్థి సమాధాన పత్రం చిత్రం ఇంటర్నెట్‌లో కనిపించడం మీకు గుర్తుండే ఉంటుంది.
అయితే ఇప్పుడు ఓ ఆన్సర్ షీట్ లో ఓ చిన్నారి స్టూడెంట్ పెళ్లికి వింత నిర్వచనం ఇచ్చింది. ఇది చూసిన తర్వాత మీరు చెబుతారు ఈ చిన్నారి విద్యార్థిని ఎవరని ఆలోచిస్తారు.
What is marriage? 😂 pic.twitter.com/tM8XDNd12P
— Paari | Panchavan Paarivendan (@srpdaa) October 11, 2022
వివాహానికి నిర్వచనం ఏమిటి అని అడిగిన ప్రశ్నకు ఓ విద్యార్థిని రాసిన సమాధానం నవ్వులు పూయిస్తుంది. పెళ్లి అంటే ఏమిటంటే.. ఇప్పుడు నువ్వు పెద్దదానివి అయ్యావు, ఇన్నాళ్లు నిన్ను మేము పోషించాము.. ఇక మావల్ల కాదు అని అమ్మాయి తల్లిదండ్రులు చెబుతారు. అప్పుడు ఒక అబ్బాయిని ఎంపిక చేసి ప్రక్రియను మొదలు పెడతారు. అమ్మాయి తల్లిదండ్రులు తమ కూతురు పెళ్లి చేయడానికి.. తమ కూతుర్ని పెంచగల వ్యక్తిని వెదుకుతారు. అప్పుడు అమ్మాయి, అబ్బాయి కలుస్తారు. తల్లిదండ్రులు తమకు నిర్ణయించిన వ్యక్తితో కూతురు పెళ్లి చేస్తారు అంటూ తన ఫీలింగ్స్ ను అందంగా ప్రెజెంట్ చేసింది. స్టూడెంట్ రాసిన సమాధానం టీచర్ కు కళ్ళు తిరిగినట్లు ఉంది. ఆన్సర్ షీట్ ను అడ్డంగా కొట్టేసి.. నాన్ సెన్స్ అంటూ సున్నా మార్కులు వేసింది.
ఈ చిత్రాన్ని @srpdaa అనే ఖాతా ద్వారా ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఇప్పటికే ఈ పోస్ట్ 15 వేల మందికి పైగా లైక్ చేయగా.. రకరకాల కామెంట్ చేస్తూ తమ రియాక్షన్స్ ఇస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..