Dog vs Snake: యజమాని కోసం త్రాచుపాముతో పోరాడి ప్రాణాలు కోల్పోయిన పెంపుడు కుక్క.
యజమానిని కాపాడేందుకు పాముతో పోరాడి ప్రాణాలు కోల్పోయిందో శునకం. చెన్నై సమీపంలో ఆవడికి చెందిన మదివాణన్-నందిని దంపతులు తమ ఇంట్లో రెండు శునకాలను పెంచుతున్నారు. ఎప్పటిలాగానే గురువారం మదివాణన్ ఉద్యోగానికి వెళ్లారు. నందిని మాత్రమే ఇంట్లో ఉంది. ఇంటి వెనుక శునకాలు పెద్దగా అరుస్తుండటంతో నందిని చూడటానికి బయటకు వస్తుండగా ఆమెను రానివ్వకుండా రెండు శునకాలు అడ్డుకున్నాయి.
యజమానిని కాపాడేందుకు పాముతో పోరాడి ప్రాణాలు కోల్పోయిందో శునకం. చెన్నై సమీపంలో ఆవడికి చెందిన మదివాణన్-నందిని దంపతులు తమ ఇంట్లో రెండు శునకాలను పెంచుతున్నారు. ఎప్పటిలాగానే గురువారం మదివాణన్ ఉద్యోగానికి వెళ్లారు. నందిని మాత్రమే ఇంట్లో ఉంది. ఇంటి వెనుక శునకాలు పెద్దగా అరుస్తుండటంతో నందిని చూడటానికి బయటకు వస్తుండగా ఆమెను రానివ్వకుండా రెండు శునకాలు అడ్డుకున్నాయి. దీంతో ఆమె పరిశీలనగా చూడగా అక్కడ ఐదడుగుల పొడవున్న త్రాచుపాము కనిపించింది. రెండు శునకాలు పాముతో పోరాటానికి దిగాయి. ఓ శునకం పాము కాటుకు గురై ప్రాణాలు కోల్పోయింది. ఈ లోగా సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు అక్కడకు చేరుకుని పామును పట్టుకుని సమీపంలోని అడవిలో విడిచిపెట్టారు. యజమానిని కాపాడటానికి ప్రాణాలు కోల్పోయిన శునకాన్ని చూసి అక్కడున్న వారంతా కంటతడిపెట్టుకున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
దారుణం.. ఆకలితో తండ్రి మృతి.. అస్థిపంజరంలా కుమార్తె
విమానం కిటికీ అద్దంపై అతను చేసిన పనికి
తేనెటీగకు లీగల్ హక్కు !! పెరిగిన ప్రాముఖ్యత
జేబులోనే మృత్యువు.. కాపాడాల్సిన ఆయుధమే.. ఆయువు తీసింది
ప్రాణాలు నిలబెట్టేందుకు.. పూల హెల్మెట్ల ప్రచారం
కొత్త ఏడాదిలో సెలవులే సెలవులు !! ఉద్యోగులకు లాంగ్ వీకెండ్స్
బ్యాంక్లో తిష్ట వేసి రూ. 316 కోట్లు దోచేసిన దొంగలు

