Viral Video: రైలులో టీ అమ్ముతూ అలసి నిద్రపోయిన వ్యక్తి.. మానవత్వాన్ని చూపించిన పోలీస్

ప్రపంచంలో రోజూ జరుగుతున్న అనేక సంఘటనలు మనిషిలో మానవత్వం అనేది ఇంకా ఉందా అనిపింస్తుంటే.. అప్పుడు ఇంకా ఈ ప్రపంచంలో మంచితనం అనేది చచ్చిపోలేదు.. మానవత్వం ఉన్న మనుషులు ఉన్నారు అని గుర్తు చేస్తూ కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఇప్పుడు వైరల్ అవుతున్న ఒక వీడియోలో మంచితనానికి మానవత్వానికి సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది. ఇందులో ఛాయ్ ఛాయ్ అంటూ అరచి అలసి సొలసిన వ్యక్తి నిద్రపోతుంటే.. మరొక వ్యక్తి చూపించిన మానవత్వం పలువురిని ఆకట్టుకుంది.

Viral Video: రైలులో టీ అమ్ముతూ అలసి నిద్రపోయిన వ్యక్తి.. మానవత్వాన్ని చూపించిన పోలీస్
Viral Video

Updated on: Oct 09, 2025 | 11:34 AM

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక హృదయాన్ని ఆకట్టుకుంటుంది. ఈ వీడియో వీక్షకులను భావోద్వేగానికి గురిచేసింది. జాలి , కరుణ, మంచితనం, మానవత్వం అనేవి ఇంకా ఇప్పటికీ లోకంలో ఉన్నాయని మరోసారి రుజువు చేసింది. 43 సెకన్ల నిడివి గల ఈ క్లిప్ అలసిపోయిన టీ అమ్మే వ్యక్తికి, ఖాకీ యూనిఫాంలో ఉన్న వ్యక్తి మధ్య హృదయ స్పర్శ సంభాషణను సంగ్రహిస్తుంది. కొందరు ఇది రియల్ గా జరిగింది కాదని.. స్క్రిప్ట్‌లో రాసుకున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. అయినా సరే ఈ వీడియో అందించే సందేశం ప్రజలను తీవ్రంగా కదిలించింది.

వీడియోలో ఒక టీ అమ్మే వ్యక్తి చాలా సమయంలో అరచి అరచి .. తిరిగి తిరిగి అలసిపోయి రైలు సీటులో నిద్రపోతున్నట్లు కనిపిస్తుంది. అతను విశ్రాంతి తీసుకుంటుండగా.. అటుగా ఒక ఖాకీ యూనిఫాంలో ఉన్న ఒక వ్యక్తి వచ్చాడు. అతను పోలీసు అనిపిస్తున్నాడు. అటుగా వచ్చిన పోలీసు నిశ్శబ్దంగా టీపాట్ తీసుకొని ప్రయాణీకులకు టీ అందించడం మొదలు పెట్టాడు. టీ అమ్ముకునే వ్యక్తికీ మెలకువ వచ్చిన తర్వాత తన టీపాట్ కనిపించడం లేదని గ్రహించాడు. అప్పుడు అతను కంగారు పడుతూ.. అటు ఇటు చూడడం మొదలు పెట్టాడు. ఇలా అతను గందరగోళంగా ఉన్నప్పుడే.. కొన్ని క్షణాల తర్వాత యూనిఫాం ధరించిన వ్యక్తి తిరిగి వచ్చి, అతన్ని హృదయపూర్వకంగా కౌగిలించుకున్నాడు. టీ అమ్మగా వచ్చిన డబ్బులను అతనికి అందజేశాడు. విక్రేత మొదట్లో డబ్బును అంగీకరించడానికి నిరాకరిస్తాడు.. అయితే పోలీసు ఆ డబ్బులను టీ అమ్మే వ్యక్తీ జేబులో పెట్టాడు.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోలోని మానవత్వం.. దాని వెనుక ఉన్న భావోద్వేగం ఆ వీడియోను వైరల్‌గా మార్చాయి. వేలాది వీక్షణలు, షేర్లను సంపాదించింది. అయితే చాలా మంది వినియోగదారులు దీనిని స్క్రిప్ట్ అని వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఈ వీడియో మంచి సందేశాన్ని ఇస్తుందని చెబుతున్నారు. ఇది నటన కావచ్చు, కానీ నిజ జీవితంలో ఇలాంటి మంచితనం మనకు మరింత అవసరం” అని ఒకరు కామెంట్ చేశారు.
మరొకరు, “ఈ పోలీసు నిజంగా హృదయాలను గెలుచుకున్నాడు. మానవత్వం ఇంకా బతికే ఉంది” అని అన్నారు. ఈ వీడియో ప్రామాణికత అనిశ్చితంగా ఉంది.. అయినా సరే దీనిలోని నైతికత కాదనలేనిది. జాలి కరుణ, దయకు మతం లేదు, హోదా లేదు, సరిహద్దులు లేవు. కరుణతో కూడిన చిన్న చిన్న పనులే మనుషుల మధ్య అంతరాన్ని చెరిపేసి మంచి సమాజాన్ని సృష్టించగలదు అని చెప్పకనే చెబుతుంది.

 

మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..