10 అడుగుల ఎత్తైన గోడెక్కిన చిరుత.. కోడిని మాములుగా వేటాడలేదుగా.! చూస్తే ఆశ్చర్యపోతారు..

తమిళనాడులోని కోయంబత్తూరులో కోడిని ఓ చిరుత వేటాడిన షాకింగ్ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. అర్ధరాత్రి వేళ జనావాసాల్లోకి వచ్చిన చిరుత.. దానికి చిక్కిన కోడిని పక్కా వ్యూహంతో వేటాడింది. ఇక కోయంబత్తూరులోని నివాస ప్రాంతాల్లో చిరుత కనిపించడంతో అటవీ శాఖ అధికారులు..

10 అడుగుల ఎత్తైన గోడెక్కిన చిరుత.. కోడిని మాములుగా వేటాడలేదుగా.! చూస్తే ఆశ్చర్యపోతారు..
Leopard

Updated on: May 31, 2024 | 2:02 PM

తమిళనాడులోని కోయంబత్తూరులో కోడిని ఓ చిరుత వేటాడిన షాకింగ్ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. అర్ధరాత్రి వేళ జనావాసాల్లోకి వచ్చిన చిరుత.. దానికి చిక్కిన కోడిని పక్కా వ్యూహంతో వేటాడింది. ఇక కోయంబత్తూరులోని నివాస ప్రాంతాల్లో చిరుత కనిపించడంతో అటవీ శాఖ అధికారులు.. ఆ ప్రాంతంలో నిఘా పెంచారు. వివరాల్లోకి వెళ్తే.. ఈ సంఘటన మే 29న ఉదయం 5 గంటలకు స్థానిక సోమయనూర్ గ్రామంలో జరిగింది. దాదాపు పది అడుగుల ఎత్తులో ఉన్న ఇంటి గోడపై కూర్చున్న కోడిని పట్టుకునేందుకు చిరుత దూకినట్లు.. ఓ సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డ్ అయింది. అటుగా వచ్చిన ఓ చిరుత మెల్లగా నక్కి.. నక్కి.. వచ్చి.. ఎత్తైన గోడపై కూర్చున్న కోడిపైకి ఒక్కసారిగా దాడి చేసింది. అయితే కోడి మరోవైపునకు దూకేసింది. కానీ ఎలాంటి లాభం లేకపోయింది. తనను తాను రక్షించుకునే ప్రయత్నంలో.. ఆ కోడి చివరికి చిరుత నోటికి చిక్కింది. ఇదంతా కూడా సీసీటీవీలో రికార్డు కాగా.. వీడియో ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. కాగా, ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం చోటు చేసుకుంది. చిరుత ఎటువైపు నుంచి వస్తోందోనని భయాందోళనకు గురవుతున్నారు. లేట్ ఎందుకు ఆ వీడియోపై ఓసారి లుక్కేసేయండి.

ఇది చదవండి: సికింద్రాబాద్‌కి ‘వందే స్లీపర్’ రైళ్లు.. ఏ రూట్‌లో ఉండనుందంటే.?

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: SRH‌కి హిట్‌మ్యాన్.. RCBకి రాహుల్.. మెగా వేలంలోకి హేమాహేమీలు.! రిటైన్ లిస్టు ఇదిగో..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి