Viral Video: లవర్స్ మధ్య ఫైట్.. మధ్యలో ఎంటరయిన డెలివరీ బాయ్.. ఆ తర్వాత షాకింగ్ సీన్
ఎవరైనా గొడవ పడుతుంటే వారిని అదుపు చేయడం కష్టమే. కొన్నిసార్లు ఆ గొడవను అదుపుచేసేందుకు వెళ్లిన వారిపైనా అక్షింతలు పడుతుంటాయి. ఒడిశాలో ఇలాంటి ఘటనే జరిగింది.
Trending News: ఇద్దరి మధ్య జరుగుతున్న గొడవలో తలదూర్చి, తిప్పలు కొనితెచ్చుకున్న వారు ఎందరో ఉంటారు. కొన్నిసార్లు ప్రాణాలు కూడా పొగొట్టుకున్న సందర్భాలున్నాయి. తాజాగా, ఓ డెలివరీ బాయ్ కూడా ఇలాంటి కష్టాన్నే కొనితెచ్చుకున్నాడు. ఒడిశా(Odisha) రాజధాని భువనేశ్వర్(Bhubaneswar)లో ఓ యువతి నడిరోడ్డు మీద తన ప్రియుడితో వాగ్వాదానికి దిగింది. అతడిపై గట్టిగా అరచి, కొద్దిసేపటికి ముఖం మీద కొట్టింది. ప్రేమికుల మధ్య గొడవను స్థానికులు చూస్తూ ఉండిపోయారు కానీ, జోక్యం చేసుకోలేదు. కొందరు వీడియోలు తీశారు. దీంతో కోపం తెచ్చుకున్న ఆ యువతి, వారి ఫోన్లను లాక్కునేందుకు ప్రయత్నించింది. తన బాయ్‌ఫ్రెండ్ తనని మోసం చేస్తున్నాడని, తనను పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి.. వేరే మహిళతో కలిసి తిరుగుతున్నాడని, అందుకే అతడిని కొడుతున్నట్టు గట్టిగా అరిచింది. ఇలా గొడవ జరుగుతుండగానే, ఓ డెలివరీ బాయ్ అటుగా వెళ్తున్నాడు. ప్రియుడిని యువతి కొట్టడం చూసి, పరిస్థితిని అదుపుచేసేందుకు ప్రయత్నించాడు. అయితే, డెలివరీ బాయ్ మధ్యలో దూరడంతో యుతికి కోపం మరింత పెరిగింది. బూతులు తిట్టడం మొదలుపెట్టింది. అలా తిట్టొద్దని, వెళ్లిపోవాలని డెలివరీ బాయ్ అభ్యర్థించినా వినలేదు. దీంతో వీరిద్దరికి గొడవ మొదలైంది. ఆ యువతి డెలివరీ బాయ్ చెంప చెళ్లుమనిపించింది. అప్పటివరకు ప్రశాంతంగా మాట్లాడిన డెలివరీ బాయ్, ఒక్కసారిగా రెచ్చిపోయాడు. ఆ యువతిపై పిడిగుద్దుల వర్షం కురిపించాడు. అక్కడున్నవారు వారిని అదుపు చేశారు. ప్రస్తుతం ఈ దృశ్యాలు నెట్టింట వైరల్ అయ్యాయి. అయితే, ఇంత గొడవ జరిగినా, ఈ ఘటనపై యువతి కానీ, ఆమె ప్రియుడు కానీ, డెలివరీ బాయ్ గానీ ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం.
Girl direct volley of expletives, beat up Boyfriend in full public glare outside #IG Park in #Bhubaneswar pic.twitter.com/7ZVUrfz7Wd
— Mohammad Suffian (@iamsuffian) March 31, 2022
AP: పాముకు చేప నైవేద్యం.. మైకంలో కాలనాగుతో ముచ్చట్లు.. కట్ చేస్తే.. షాకింగ్ వీడియో