Viral Video: స్కూల్‌కొచ్చిన అనుకోని అతిధి.. దెబ్బకు విద్యార్దులు పరుగో పరుగు.. చూస్తే గుండె గుభేల్!
స్కూల్‌కొచ్చిన విద్యార్ధులందరినీ ఓ అనుకోని అతిధి పలకరించింది. ఆ అతిధిని చూడగానే దెబ్బకు అందరూ పరుగులు పెట్టారు.
స్కూల్‌కొచ్చిన విద్యార్ధులందరినీ ఓ అనుకోని అతిధి పలకరించింది. ఆ అతిధిని చూడగానే దెబ్బకు అందరూ పరుగులు పెట్టారు. ఇంతకీ ఆ అనుకోని అతిధి ఎవరు.? ఆ కథేంటి.? అనేది ఇప్పుడు చూద్దాం..
వివరాల్లోకి వెళ్తే.. ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్ స్కూల్‌లో భారీ పైథాన్ ఒకటి హల్చల్ చేసింది. పాఠశాలలోని ఓ కిటికీలో ఈ పైథాన్ సేద తీరుతుండగా.. అప్పుడే స్కూల్‌కు చేరుకున్న కొందరు స్టూడెంట్స్, టీచర్లు దాన్ని గుర్తించారు. వారందరూ కూడా భయభ్రాంతులకు గురి కావడంతో.. స్కూల్ యాజమాన్యం వెంటనే స్నేక్ క్యాచర్స్‌కు సమాచారాన్ని అందించింది.
సమాచారం అందుకున్న వెంటనే స్పాట్‌కు చేరుకున్న సన్‌షైన్ కోస్ట్ స్నేక్ క్యాచర్స్.. కిటికీలో నుంచి ఆ పైథాన్‌ను చాకచక్యంగా బయటికి తీశారు. అనంతరం స్థానికంగా ఉండే అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. కాగా, అందుకు సంబంధించిన విజువల్స్ స్నేక్ క్యాచర్స్ తమ సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేయడంతో.. అవి కాస్తా ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. లేట్ ఎందుకు ఆ వీడియోపై మీరూ లుక్కేయండి.