సనాతన హిందూ ధర్మం ప్రకృతిలోని ప్రతి జీవిలోనూ భగవంతుడిని దర్శించమని సూచిస్తుంది. పులి, సర్పం , సింహం, గరుత్మంతుడు, కాకి, వానరం వంటి ఇలా ప్రతి జీవికి భగవంతుని మధ్య ఏదొక రిలేషన్ ఉంది. ఈ విషయాన్నీ గ్రహించిన మానవులు ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తూ..తమ సమయాన్ని వివిధ మతపరమైన పనులకు వెచ్చిస్తారు. వాస్తవానికి దేవుడి దర్శనం కోసం నమస్కరించడానికి ఆలయాన్ని సందర్శించడం అనేది పూజాదికార్యక్రమాల్లో ముఖ్యమైంది. ఎక్కువ మంది ప్రతిరోజూ ఆలయాన్ని సందర్శిస్తారు. అత్యంత భక్తి శ్రద్దలతో పూజ చేస్తారు. అయితే మనుషులు మాత్రమే కాదు.. దేవుళ్లను కొన్ని జంతువులూ కూడా అత్యంత భక్తి శ్రద్దలతో పూజిస్తుంది.. ఇలాంటి సంఘటనలు అనేకం చూస్తూనే ఉన్నాం.. ఆవు, పంది, పాము వంటివి ప్రతిరోజూ ఆలయాన్ని సందర్శించి వీడియోలు చూసి ఉంటారు. కానీ.. ఏ జంతువు అయినా గుడిలోకి వెళ్లి మనిషిలా రెండు చేతులతో నమస్కరించడం చూశారా? ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో ఒక వానరంగుడిలోపలికి వెళ్లి.. మనిషిలా దైవానికి నమస్కరిస్తుంది.
వీడియోలో పేర్కొన్నట్లుగా.. ప్రతి రోజూ ఓ వానరం దేవుడి దర్శనం కోసం ఆలయానికి వెళ్తుంది. ఈ కోతి ప్రతిరోజూ ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలోని శ్రీ బుద్ధేశ్వర్ మహాదేవ్ ఆలయానికి వెళ్తుంది. వీడియోలో చూస్తే.. వానరం ఒక గుడి వైపు నడుస్తూ కనిపిస్తుంది. కోతి తాను వెళ్లే దారిలో చాలా మంది మనుషులు కనిపించినప్పటికీ ఎవరినీ పట్టించుకోకుండా మెట్లు ఎక్కుతూ దైవం దగ్గరకు వెళ్తుంది. మెట్లు ఎక్కి.. ఆలయ ప్రాంగణంలోకి చేరుకోగానే.. వెంటనే.. వానరం రెండు చేతులు ముడుచుకుని నమస్కరిస్తుంది. పరశురామునికి నమస్కరించి.. కాసేపటి తర్వాత మళ్లీ ఆలయ ప్రాంగణం లోపలి వైపు నడుస్తుంది.
అయితే అక్కడ కోతిని చూసి ఓ కుక్క మొగుడుతుంది.. దీంతో కొంచెం సేపు ఆగి.. ధైర్యంగా కుక్కను తరిమివేసి.. వానరం మరొక ఆలయ ద్వారం వైపు వెళ్తుంది. అక్కడ మళ్ళీ శివుని గుడి ముందు ముకుళిత హస్తాలతో తల వంచుకుని ప్రార్ధిస్తుంది. అలా దైవాన్ని ప్రార్ధిస్తూ.. వానరం చాలాసేపు అదే స్థితిలో ఉంటుంది. వైరల్ అవుతున్న ఈ వీడియో నెటిజన్లను విస్మయానికి గురి చేస్తోంది. నెటిజన్లు వానరంపై ఎడతెగని ప్రేమను, ప్రశంసలను కురిపిస్తున్నారు.
వానరం శరీరాన్ని పొందినప్పటికీ.. ‘సిధ్ పురుషుడు’ ఆత్మ”, ఒకరు కామెంట్ చేయగా.. “సనాతన ధర్మం ఉన్నతంగా ఉండటానికి ఇదే కారణం.” అంటూ మరొకరు.. ఆధ్యాత్మిక వానరాన్ని చూస్తుంటే చాలా సంతోషముగా ఉందని మరొకరు ఇలా రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..