Viral Video: రోడ్డు దాటుతున్న చిరుతను ఢీకొట్టిన బైకర్‌.. తర్వాత ఏం జరిగిందంటే..? షాకింగ్‌ వీడియో వైరల్‌..

కేరళ-తమిళనాడు సరిహద్దులో దారుణ సంఘటన చోటు చేసుకుంది.. సమీపంలోని నడుకాని మరపాలెం వద్ద రోడ్డు దాటుతుండగా మోటారు సైకిల్ ఢీకొనడంతో ఒక చిరుతపులి గాయపడింది. గురువారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వేగంగా చక్కర్లు కొడుతోంది. బైక్‌పై వేగంగా వెళ్తున్న ఓ వ్యక్తి ఊహించని విధంగా రోడ్డుదాటున్న చిరుతను ఢీకొట్టాడు. చిరుతపులి, బైక్ రైడర్ ఇద్దరూ నేలపై పడిపోయారు...

Viral Video: రోడ్డు దాటుతున్న చిరుతను ఢీకొట్టిన బైకర్‌.. తర్వాత ఏం జరిగిందంటే..? షాకింగ్‌ వీడియో వైరల్‌..
Leopard Collides With Bike

Updated on: Mar 01, 2025 | 5:22 PM

వైరల్‌ వీడియో ప్రకారం.. తమిళనాడులోని నీలగిరి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గురువారం ఉదయం 8 గంటల సమయంలో గుడలూర్ ప్రాంతానికి చెందిన రాజన్ బైక్‌పై ప్రయాణించాడు. కేరళ, తమిళనాడు సరిహద్దు సమీపంలోని నడుకాని మరపాలెం వద్ద రోడ్డు దాటుతున్న చిరుత పులిని బైక్‌తో ఢీకొట్టాడు. ఇద్దరూ బలంగా ఢీకొనడంతో బైక్‌ సహా బండి నడిపుతున్న వ్యక్తి రోడ్డు పక్కన పడగా చిరుత రోడ్డుపై కుప్పకూలింది. కొంతసేపటి తర్వాత అది స్పృహలోకి వచ్చింది. లేచి సమీపంలోని చెట్ల పొదల్లోకి వెళ్లిపోయింది. ఇదంతా దూరంగా ఉన్న ఓ వాహనంలోని వ్యక్తి తన సెల్‌ఫోన్‌లో రికార్డ్‌ చేశాడు.. కాగా, ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ మారింది..

ప్రమాదంలో కిందపడిన బైక్‌ రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. స్వల్పంగా గాయపడిన రాజన్‌ పైకి లేచి అక్కడి నుంచి దూరంగా వెళ్లాడు. అయితే బైక్‌ ఢీకొట్టడంతో చిరుత రోడ్డు మధ్యలో పడిపోయింది. చాలా సేపటి వరకు అది కదలలేదు. ఆ తర్వాత చిరుత స్పృహలోకి వచ్చింది. ఉన్నట్టుండి పైకి లేచింది. సమీపంలోని చెట్ల పొదల్లోకి ఆ చిరుత వెళ్లిపోయింది.

సోషల్ మీడియాలో వీడియో వైరల్ గా మారటంతో  అటవీ శాఖ దృష్టికి వెళ్లింది. ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ అధికారులు ఫుటేజీని పరిశీలించి, సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. చిరుతకు ఎటువంటి తీవ్రమైన గాయాలు కాలేదని నిర్ధారించారు.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..