Watch: ఏనుగుల మందకు ఎదురెళ్లిన పెద్ద పులి.. నెక్ట్స్ సీన్‌ ఏం జరిగిందంటే..! వీడియో వైరల్‌

|

May 01, 2023 | 3:18 PM

మామూలుగా పులి అంటే అందరికీ భయమే.. అత్యంత విస్మయాన్ని కలిగించే ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ వీడియోని నిజానికి వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ విజేత సింహా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసారు. ఆ తర్వాత IFS అధికారి ట్విట్టర్ లో షేర్ చేశారు. ట్విట్టర్ లో వైరల్ అవుతోన్న ఈ వీడియోకు ఇప్పటివరకు 38వేల వ్యూస్ వచ్చాయి. అనేక కామెంట్లు కూడా వెల్లువెత్తాయి.

Watch: ఏనుగుల మందకు ఎదురెళ్లిన పెద్ద పులి.. నెక్ట్స్ సీన్‌ ఏం జరిగిందంటే..! వీడియో వైరల్‌
Tiger And Elephants
Follow us on

పులులంటే అందరికీ భయమే..! మనుషులే కాదు అడవి జంతువులు సైతం పులిని చూస్తే ప్రాణాలు కాపాడేందుకు పరుగులు తీస్తాయి. సాధారణంగా పులులు జింకలు, కోతులు, పందులు వంటి చిన్న , పెద్ద అనే తేడా లేకుండా కనిపించిన జంతువుపై మెరుపుదాడి చేసి అరగించేస్తాయి. అయితే, అలాంటి పులులు ఏనుగులను వేటాడే సందర్భాలు చాలా అరుదనే చెప్పాలి. అయితే, పులిని చూసి అడవి జంతువులు పారిపోతుంటే.. ఏనుగు మాత్రం పులంటే నాకేం భయం అన్నట్టుగా గంభీరంగా నడుచుకుంటూ వెళ్తుంది. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో అడవిలోని అత్యంత ఆకర్షణీయమైన రెండు జంతువుల మధ్య పరస్పర గౌరవం, సామరస్యం వంటి అరుదైన లక్షణాన్ని చూపిస్తోంది. వైరల్‌ అవుతున్న ఈ వీడియోని ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) అధికారి సుశాంత నందా షేర్ చేయగా, సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారింది.

ఈ వైరల్ వీడియోలో ఏనుగుల మంద చెట్ల మధ్యలో నుంచి వస్తుండగా.. ఆ సమయంలో ఆ దారినే వెళ్తున్న పులి.. ఏనుగుల గుంపును గమనించి ఓ పక్కకు దాక్కున్నట్టుగా ఉండిపోతుంది. ఆ తర్వాత పులి లేచి నిలబడి కాసేపు అటు ఇటూ తిరుగుతుంది. అప్పుడే పరుగెత్తుతున్న మరో ఏనుగు కనిపించడంతో పులి పరుగెత్తి పొదల్లో దాక్కుంది. ఏనుగులు వెళ్లిపోయిన తర్వాత పులి అక్కడ్నుంచి అడవిలోకి వెళ్లిపోయింది. మామూలుగా పులి అంటే అందరికీ భయమే.. అత్యంత విస్మయాన్ని కలిగించే ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ వీడియోని నిజానికి వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ విజేత సింహా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసారు. ఆ తర్వాత IFS అధికారి ట్విట్టర్ లో షేర్ చేశారు.

ఇవి కూడా చదవండి

ట్విట్టర్ లో వైరల్ అవుతోన్న ఈ వీడియోకు ఇప్పటివరకు 38వేల వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోతో పాటు, జంతువులు ఇలా కమ్యూనికేట్ చేస్తాయి & సామరస్యాన్ని కాపాడుకుంటాయి… ఏనుగు పులిని వాసన చూస్తుంది. రాజు టైటాన్ మందకు దారి ఇస్తాడు” అని క్యాప్షన్ ను కూడా ఐఎఫ్ఎస్ అధికారి రాసుకొచ్చారు.

ట్విట్టర్‌లో వైరల్‌గా మారిన ఈ వీడియోకు ఇప్పటివరకు 41.2 k వ్యూస్ మరియు 2 వేలకు పైగా లైక్‌లు వచ్చాయి. అనేక కామెంట్లు కూడా వెల్లువెత్తాయి. ఒక వినియోగదారు, ‘ఎంత అందమైన దృశ్యం. ఏనుగుల మందకు పులి దారి చూపిన తీరు నాకు బాగా నచ్చింది’ అని వ్యాఖ్యానించారు. ‘చివరికి ఏనుగును చూసి పులి పొదలోకి దూకే సన్నివేశం నాకు బాగా నచ్చింది’ అంటూ మరో యూజర్ ఫన్నీ కామెంట్ చేశాడు.

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి :