Trending News: పిల్లల్ని కంటే అదిరిపోయే ప్రైజ్ మనీ ఆఫర్ చేసిన దేశం
పైన హెడ్డింగ్ చూసి నిజంగానే షాక్ అయ్యారు కదా. ఇది అక్షరాల నిజమే. ఈ మధ్య కొన్ని దేశాల్లో జననాల రేటు అనేది పూర్తిగా తగ్గిపోతుంది. దీంతో బిడ్డల్ని కనేందుకు ఆయా ప్రభుత్వాలు అద్భుతమైన ఆఫర్లు పెడుతున్నాయి. అంతే కాదు ఆ దేశాల్లోని ఉద్యోగస్తులకు కూడా మంచి బంపర్ ఆఫర్లు ఇస్తున్నాయి. ఇటీవల చైనా దేశం కూడా ఇలాంటి కార్యక్రమాలే చేపట్టింది. ఇప్పుడు దక్షిణ కొరియా.. ఆ దేశ ప్రజలకు మంచి ఆఫర్లతో ఊరిస్తుంది. అసలు ఈ ప్రైజ్ మనీ విషయం ఏంటో..
పైన హెడ్డింగ్ చూసి నిజంగానే షాక్ అయ్యారు కదా. ఇది అక్షరాల నిజమే. ఈ మధ్య కొన్ని దేశాల్లో జననాల రేటు అనేది పూర్తిగా తగ్గిపోతుంది. దీంతో బిడ్డల్ని కనేందుకు ఆయా ప్రభుత్వాలు అద్భుతమైన ఆఫర్లు పెడుతున్నాయి. అంతే కాదు ఆ దేశాల్లోని ఉద్యోగస్తులకు కూడా మంచి బంపర్ ఆఫర్లు ఇస్తున్నాయి. ఇటీవల చైనా దేశం కూడా ఇలాంటి కార్యక్రమాలే చేపట్టింది. ఇప్పుడు దక్షిణ కొరియా.. ఆ దేశ ప్రజలకు మంచి ఆఫర్లతో ఊరిస్తుంది. అసలు ఈ ప్రైజ్ మనీ విషయం ఏంటో.. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
దక్షిణ కొరియాలో ఈ మధ్య జనాభా బాగా తగ్గిపోయింది. దీంతో ఈ ప్రభుత్వం.. ఇతర ప్రైవేట్ కంపెనీల్లో పని చేసే ఉద్యోగస్తులు ఎక్కువ మంది పిల్లల్ని కనేలా ప్రోత్సహించడానికి ఆర్థిక ప్రోత్సహాకాలను అందిస్తున్నాయి. ఆ దేశానికి చెందిన బూయోంగో అనే నిర్మాణ సంస్థ కూడా ఈ బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది.
బిడ్డకు జన్మ నిచ్చిన ఉద్యోగస్తులకు బోనస్‌గా రూ.62 లక్షల రూపాయలను అందిస్తున్నట్లు బూయోంగో నిర్మాణ సంస్థ ప్రకటించింది. కాగా 2021 నుంచి ఇప్పటి వరకు 70 మంది పిల్లలకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు రూ.43.65 కోట్లు చెల్లించినట్లు ఆ సంస్థ వెల్లడించింది. ఇప్పుడు ఈ ఆఫర్ మహిళలు, పురుషులకు కూడా వర్తిస్తుందని తెలిపింది. జన్మనిచ్చిన ప్రతీ సారి ఈ మొత్తాన్ని చెల్లిస్తామని పేర్కొంది.
కాగా మహిళలు కుటుంబాన్ని ప్రారంభించిన తర్వాత ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. అంతే కాకుండా ఖర్చులు కూడా అధికమవుతున్నాయి. దీంతో చాలా మంది ముందు ఆర్థికంగా ఎదిగేందుకు పిల్లల్ని కనేందుకు ఆలస్యం చేస్తున్నారు. తూర్పు ఆసియాలో ఈ సంఖ్య అత్యధికంగా ఉంది.
ఈ క్రమంలోనే దక్షిణ కొరియా దేశం ఈ నిర్ణయం తీసుకుంది. తమ దేశంలో జనాభాను పెంచుకునేందుకు ఈ ఆఫర్లతో ఊరిస్తుంది. అంతే కాకుండా పిల్లలు పుట్టినప్పుడు అయ్యే ఖర్చును కూడా ప్రభుత్వమే భరిస్తుంది. ఈ స్కీమ్‌తో అయినా దక్షిణ కొరియాలో జనాభా రేటు పెరుగుతుందో లేదో చూడాలి. అయితే ప్రస్తుతం ఈ విషయం మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వార్తపై నెటిజన్లు హాస్యాస్పదంగా రియాక్ట్ అవుతున్నారు.