చెన్నై, జులై 23: నోరూరించే ఫుడ్ ఆఫర్ ఇచ్చి ఓ రెస్టారెంట్ కష్టాల్లో పడింది. తాజాగా ‘బాహుబలి థాలీ’ పేరిట మంచి ఆఫర్ ప్రకటించింది. నెగ్గిన వారికి క్యాష్ బ్యాక్ ప్రకటించింది కూడా. ఐతే ఈ ఆఫర్ పేరిట ఆహారం వృద్ధా చేస్తున్నారంటూ పలువురు విమర్శించడంతో అది కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. వివరాల్లోకెళ్తే..
చెన్నైలోని పొన్నుస్వామి హోటల్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన ‘బాహుబలి థాలీ’ పోటీ సోషల్ మీడియాలో విమర్శల పాలైంది. థాలీ ధర కేవలం రూ.1399 మాత్రమే ఉండటంతో కస్టమర్లు కూడా తినేందుకు పోటీపడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను అనంత్ రూపన్‌గూడి అనే యూజర్ తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో ఇద్దరు వ్యక్తులు రకరకాల వంటకాలతో ఉన్న థాలీ భారీ ప్లేట్‌ను కస్టమర్‌ల దగ్గరకు తీసుకురావడం కనిపిస్తుంది.
అబ్బ..థాలీని చూస్తుంటే నోరూరుతోందని కొందరు లొట్టలేస్తుంటే.. మరికొందరేమో ఇది ఏమంత మంచి ఆలోచన కాదంటూ విమర్శిస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో ఆహారం చూస్తే ఎవరికైనా ఆకలి చచ్చిపోతుంది. ప్రపంచంలో సగం మంది ఆకలితో అలమటిస్తున్నారు. దయచేసి సరదాలకు పోయి ఫుడ్ వేస్ట్ చేయడం మంచిది కాదని విమర్శలు చేస్తున్నారు. ఇంతకీ మీరేమంటారు..
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.