మే నెల ముగిసిపోయింది. జూన్ ఆహ్లాదకరమైన వాతావరణంతో ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, ఇప్పుడు వేడి పెరుగుతుందని వాతావరణ శాఖ తెలిపింది! అటువంటి పరిస్థితిలో ప్రజలకు కూలర్, AC వాడకం తప్పనిసరిగా మారింది. బయట వాతావరణం ఎంత వేడిగా ఉన్నప్పటికీ, ఇల్లు, పడక గది వాతావరణం చల్లగా ఉండాలని భావిస్తారు ప్రతి ఒక్కరు. ఈ క్రమంలోనే కొందరు డబ్బు ఖర్చుపెట్టి విద్యుత్ యంత్రాలను కొనుగోలు చేస్తుంటే.. మరికొందరు మాత్రం జుగాడ్ ప్రయత్నిస్తుంటారు. ఇటీవల సోషల్ మీడియాలో ఎండవేడిమి, ఉక్కపోతకు చెక్ పెట్టే విధంగా అనేక జుగాడ్ పరికరాలను తయారు చేసిన వీడియోలు చూశాం. కొందరు మట్టి పెంకులతో కూలర్లు, కొందరు ఫ్యాన్‌కు కవర్ తొడుగు వేసి చల్లటి గాలిని బందించి ఆస్వాదించిన వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. ఇక్కడ మరో జుగాడ్‌తో అలాంటి కూలర్‌ని సిద్ధం చేశారు. ఇది చూసి కొందరు వావ్.. అంటున్నారు. అది చూస్తే మీరు కూడా అవాక్కవ్వాల్సిందే..
ఈ వైరల్ వీడియోలో, నీలిరంగు నీళ్ల డ్రమ్‌ని వాడుకుని ఒక వ్యక్తి ‘కూలర్’గా మార్చేశాడు.. ఇందుకోసం ప్రత్యేకంగా ఆ డ్రమ్‌ను కావాల్సిన విధంగా కత్తిరించాడు. అలాగే అందులో ప్లాస్టిక్ ఫ్యాన్, వాటర్ మోటార్, గడ్డి తదితర అవసరమైన వస్తువులను అమర్చారు. చివరగా విద్యుత్ కనెక్షన్, స్విచ్ బోర్డు కూడా కనెక్ట్ చేశారు. దీంతో మార్కెట్లో డబ్బు ఖర్చుపెట్టి కొనుగోలు చేసిన కూలర్ కంటే క్వాలిటీతో ఈ కూలర్‌ని తయారు చేశాడు. చూడ చక్కటి రూపంతో ఎంతో అద్భుతంగా ఈ కూలర్ తయారైంది. ఇది అంతేస్థాయిలో చల్లటి గాలిని అందిస్తుంది.
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ‘విక్కీ శర్మ’ (@vikramv5840) ఏప్రిల్ 25న పోస్ట్ చేశారు. అతను క్యాప్షన్‌లో రాశాడు – దీని కంటే బెస్ట్ కూలర్ మీరు ఎక్కడైనా కొనగలరా..? అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఈ వైరల్ వీడియోకి దాదాపు 7లక్షలకు పైగా లైక్స్, కోటికి పైగా వ్యూస్ వచ్చాయి. అలాగే, వేలాది మంది వినియోగదారులు వ్యాఖ్యానించారు. ఒక వినియోగదారు రాశారు – ITI ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్. మరొకరు రాశారు – ఈ ప్రతిభ భారతదేశం నుండి బయటకు వెళ్లకూడదు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..