తోటలో 9 అడుగుల కింగ్ కోబ్రా.. పడగ విప్పి అలాగే చూస్తోంది..! ఏం జరిగిందని దగ్గరికెళితే..

గోదావరి నదికి వరద నీటి ప్రవాహం తగ్గముఖం పట్టినప్పటికీ, తీరప్రాంత ప్రజలకు కొత్త రూపంలో ముప్పు వచ్చిపడింది. పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల సరిహద్దు గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం పాముల సంచారం తీవ్ర భయాందోళన కలిగిస్తోంది. వరదల కారణంగా తమ సహజ ఆవాసాలను కోల్పోయిన భారీ సర్పాలు, పొదలు, అడవులను విడిచిపెట్టి పంట పొలాలు, మామిడి తోటలు, మానవ నివాసాల వైపు వస్తున్నాయి.

తోటలో 9 అడుగుల కింగ్ కోబ్రా.. పడగ విప్పి అలాగే చూస్తోంది..! ఏం జరిగిందని దగ్గరికెళితే..
Snake Menace In Eluru

Edited By:

Updated on: Aug 08, 2026 | 9:47 AM

గోదావరికి వరద తగ్గింది. అయితే అదే సమయంలో పాముల బెడద ఎక్కువ అయింది. పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల సరిహద్దు పరిసరాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో ఇటీవల పాముల సంచారం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. అడవులు, పొదల్లో ఉండాల్సిన భారీ సర్పాలు పంట పొలాలు, మామిడి తోటలు మరియు మానవ నివాసాల వద్దకు చేరుతుండటంతో ప్రజలు ఉలిక్కిపడుతున్నారు.

తోటలో 6 మీటర్ల కింగ్ కోబ్రా:

మొగల్తూరు కోట సమీపంలోని సంకువారి మామిడి తోటలో అత్యంత ప్రమాదకరమైన ‘కింగ్ కోబ్రా’ (రాజనాగం) కనిపించడంతో స్థానికులు షాక్‌కు గురయ్యారు. పొలం పనులకు వెళ్లిన రైతులకు సుమారు 9 అడుగుల పొడవున్న ఈ రాజనాగం పడగవిప్పి నిలబడటంతో భయంతో పరుగులు తీశారు. కొందరు ఈ దృశ్యాలను ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ వీడియోలు వైరల్‌గా మారాయి. ఈ భారీ సర్పం ఎక్కడైనా గుడ్లు పెట్టి స్థావరం ఏర్పాటు చేసుకుందేమోనని చుట్టుపక్కల నివాసితులు భయపడుతున్నారు.

చాకచక్యంగా పట్టుకున్న రెస్క్యూ టీమ్:

మరొక సంఘటనలో, నరసాపురం గ్రామీణ మండలం లక్ష్మణేశ్వరం పంచాయతీ పరిధిలోని కొత్తపేట కాలనీలో దాదాపు 9 అడుగుల పొడవైన నల్ల త్రాచుపాము సంచరిస్తున్నట్లు స్థానికులు గమనించారు. వెంటనే వారు జిల్లా అటవీ శాఖకు సమాచారం అందించారు. డిఎఫ్ఓ కిరణ్ ఆదేశాల మేరకు ఫారెస్ట్ రేంజర్ కరుణాకర్ నేతృత్వంలో అటవీ సిబ్బంది, ‘నెస్ట్ కన్జర్వేషన్ సొసైటీ’ ప్రతినిధులు మరియు సర్పమిత్ర వాలంటీర్లు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. పొదల్లో దాక్కున్న నల్ల త్రాచుతో పాటు, అదే గ్రామంలో వలలో చిక్కుకుని విలవిలలాడుతున్న ఒక భారీ జెర్రిపోతును కూడా సురక్షితంగా బయటకు తీశారు.

ఇవి కూడా చదవండి

దర్భరేవు అడవుల్లో విడుదల:

పట్టుబడిన ఈ రెండు పాములను దర్భరేవు సమీపంలోని జనావాసాలు లేని మడ అటవీ (మ్యాంగ్రోవ్) ప్రాంతానికి తరలించి సురక్షితంగా విడిచిపెట్టారు. పాములు కనిపించిన వెంటనే వాటిని కొట్టి చంపకుండా అటవీ శాఖకు సమాచారం అందించి పర్యావరణ పరిరక్షణకు సహకరించిన స్థానికులను, పర్యావరణ ప్రేమికులను అధికారులు అభినందించారు. వరదలు, వర్షాల కాలంలో పాములు బయటకు వచ్చే అవకాశం ఉన్నందున రైతులు, తోటల యజమానులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us