AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ సైకిల్‌ నా సొంతం అంటున్న సర్పం..! దాని సంగతేంటో తెలిస్తే..

ఊహించుకోండి... మీరు మీ సైకిల్‌పై బయలుదేరబోతున్నారు. హ్యాండిల్‌ను పట్టుకోవడానికి మీ చేతిని చాచినప్పుడు... ఇనుప చల్లని రాడ్‌కు బదులుగా, ప్రాణం ఉన్న జీవి ఏదో మీ వేళ్లను తాకితే ఎలా ఉంటుంది..? అప్పుడు ఖచ్చితంగా ముందు మీ గుండె కొట్టుకోవడం ఆగిపోయినంత పనవుతుంది. ఆ తరువాత అది ఏమిటో చూడాలనిపిస్తుంది. ఇక్కడ వైరల్‌గా మారిన పోస్ట్‌లో ఒక వ్యక్తికి సరిగ్గా అలాంటి సంఘటనే ఎదురైంది. అతని సాధారణ రోజు అకస్మాత్తుగా ఊహించని విపత్తుగా మారింది. ఇంతకీ ఏం జరిగిందో పూర్తి డిటెల్స్‌లోకి వెళ్లాల్సిందే...

ఈ సైకిల్‌ నా సొంతం అంటున్న సర్పం..! దాని సంగతేంటో తెలిస్తే..
Snake On Bicycle
Jyothi Gadda
|

Updated on: Dec 01, 2025 | 8:23 PM

Share

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఒక పోస్ట్‌లో ఒక పాము సైకిల్ హ్యాండిల్‌బార్లు, బ్రేక్‌ల మధ్య హాయిగా చుట్టుకుని సేదతీరుతోంది. అదేదో దాని సొంత సింహాసనంలాగా భావించింది అనుకుంటా..! ఆ పాము చూసేందుకు శరీరంపై నలుపు-తెలుపు చారల నమూనా, దాని కళ్ళ వెనుక ఉన్ననల్లటి గీతలు, ఒక వింత మెరుపు ప్రజలను ఇది ప్రమాదకరం అని అనుకునేలా కనిపిస్తుంది. ఇది నిజంగానే ఇంటర్నెట్ వేదికగా ప్రజల్ని భయాందోళనలకు గురిచేసేలా ఉంది.

ఫోటోను విశ్లేషించిన తర్వాత, నిపుణులు ఆ పాము చెకర్డ్ కీల్‌బ్యాక్ అని నిర్ధారించారు. దీనిని శాస్త్రీయంగా జెనోక్రోఫిస్ పిస్కేటర్ అని పిలుస్తారు. భారతదేశంలో విస్తృతంగా కనిపించే ఈ పాము ఎక్కువగా నీటి దగ్గర నివసిస్తుంది. ఇది మనుషులకు దూరంగా ఉంటుంది. ముఖ్యంగా ఇది విషపూరితమైనది కాదు. ప్రజలను భయపెట్టే దాని గీతల చర్మం కేవలం ఒక అందమైన గుర్తింపు లక్షణం. ఎలాంటి ముప్పు ఉండదని నిపుణులు చెబుతున్నారు.

Does anyone know this snake byu/This-Park3826 inKerala

ఇవి కూడా చదవండి

సోషల్ మీడియాలో పోస్ట్‌ వైరల్‌గా మారడంతో నెటిజన్ల నుండి కామెంట్ల వరదకు దారితీసింది. ఒక వినియోగదారుడు ఇలా వ్రాశాడు, సోదరా, సైకిల్ ఇప్పుడు పాము సొంతం అంటున్నారు. కొంతమంది భయాన్ని వ్యక్తం చేశారు. కానీ, నిపుణులు, ఇది హానిచేయని నీటి పాము అని దానిని ఇబ్బంది పెట్టవద్దు అని అంటున్నారు. పాములు ఎక్టోథెర్మిక్ జీవులు, బాహ్య వాతావరణం నుండి వేడిని గ్రహిస్తాయి. వర్షం లేదా చలి కాలంలో అవి పొడి, వెచ్చని, సురక్షితమైన ప్రదేశాలను వెతుక్కుంటూ వెళ్తాయి. గ్యారేజీలు, కార్ హుడ్స్, సైకిల్ హ్యాండిల్‌బార్లు వంటి ప్రదేశాల్లో అవి ఎక్కువగా నక్కి దాక్కుంటాయి. కాబట్టి, వర్షాకాలం, చలికాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..