Ganga Ghat Viral Video: హరిద్వార్‌లోని గంగా ఘాట్ వద్ద ప్రత్యక్షమైన పాము..! ఆ తర్వాత ఏం జరిగిందంటే..!!

|

Jul 02, 2024 | 7:49 AM

ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు హరిద్వార్‌లోని గంగా ఘాట్‌లో పుణ్యస్నానాలు చేస్తుంటారు.. హరిద్వార్‌లో పూజ చేసిన తర్వాత గంగలో స్నానం చేయాలనేది పురాణల నుంచి వస్తున్న నమ్మకం.అయితే ప్రస్తుతం గంగా ఘాట్‌ వద్ద జరిగిన ఒక సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.

Ganga Ghat Viral Video: హరిద్వార్‌లోని గంగా ఘాట్ వద్ద ప్రత్యక్షమైన పాము..! ఆ తర్వాత ఏం జరిగిందంటే..!!
Ganga Ghat
Follow us on

హరిద్వార్ వెళ్లి గంగాస్నానం చేయాలనేది పౌరాణిక నమ్మకం. సముద్ర మథనం సమయంలో హరిద్వార్‌లోనే కొన్ని అమృతపు చుక్కలు పడ్డాయని, అందుకే గంగానదిలో స్నానానికి మరింత ప్రాముఖ్యత ఉందని చెబుతారు. ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో ప్రజలు స్నానానికి హరిద్వార్ చేరుకుంటారు. ప్రస్తుతం హరిద్వార్‌లోని గంగా ఘాట్‌కి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ఈ వీడియో Instagram హ్యాండిల్ @thakurji551లో షేర్‌ చేయబడింది. గంగా ఘాట్ వద్ద ఓ భారీ సర్పం ప్రత్యక్షమైంది. నదిలో స్నానం చేస్తున్న భక్తులకు నీళ్లలో ఏదో పాకుతూ రావటం కనిపించింది. అదేంటని చూడగా పొడవైన పాము అని తెలిసింది. భక్తులంతా వెంటనే తలోదిక్కుకు పరుగులు తీశారు. వారిలో ఒక వ్యక్తి మాత్రం ధైర్యం చేసి పామును పట్టుకున్నాడు. కానీ అది జారిపోతుంది. అతడు దాన్ని పట్టుకుని నీటిలో దూరంగా విసిరేశాడు.

ఇవి కూడా చదవండి

కానీ, ఆ పాము అంతేవేగంగా ఘాట్‌ వైపుకు పరుగులు తీసింది. ఇదంతా చూస్తూ అక్కడి జనాలు ఆశ్చర్యపోతున్నారు. మరికొందరు భయంతో దూరంగా పారిపోయి నిల్చుని చూస్తున్నారు. కాగా, ఓ వ్యక్తి ఘాట్‌ వద్ద ఏర్పాటు చేసిన రెయిలింగ్‌ రాడ్‌ ఎక్కి కూర్చోవటం వీడియోలో కనిపించింది. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా వేగంగా వైరల్ అవుతోంది. ఇంటర్‌నెట్‌ వినియోగదారుల దృష్టిని ఆకర్షించింది. దీనికి ఇప్పటి వరకు 12 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. ఇది మాత్రమే కాదు, ఈ వీడియో 1.2 మిలియన్ల వీక్షణలను కూడా సేకరించింది.

వినియోగదారులు పెద్ద సంఖ్యలో దీనిపై వారి అభిప్రాయాలను చెబుతున్నారు. దీనిపై యూజర్లు కూడా భారీగానే కామెంట్స్ చేస్తున్నారు. ఒక వ్యక్తి ఇలా వ్రాశాడు – పాము బయటకు రావడానికి ప్రయత్నిస్తోంది. మరొక వినియోగదారు ఇలా వ్రాశారు – బ్రదర్, పాము నీటిలో జీవించలేదని అనగా, మూడో వ్యక్తి ఇలా వ్రాశాడు – బ్రదర్,ఆ పామును పట్టుకుని సురక్షితంగా వేరే చోట వదిలిపెట్టండి. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు గంగా ఘాట్‌లో స్నానానికి వచ్చే ప్రాంతం.ఎవరినైనా కాటు వేస్తే ఎవరు బాధ్యులు? అంటూ వ్యాఖ్యానించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..