Viral: కారు అద్దాన్ని వైపర్‌తో తుడుస్తుంటే.. ఎదురుగా నల్లటి ఆకారం.. బాబోయ్.!

మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు నదులు, జలపాతాలన్నీ ఉప్పొంగుతున్నాయి. దీంతో అక్కడక్కడా జలచరాలు జనావాసాల్లోకి కొట్టుకొస్తున్నాయి. తాజాగా రత్నగిరి జిల్లాలోని తీరప్రాంతమైన చిప్లన్‌లోని చించ్ నాకా పరిసరాల్లో ఆదివారం రాత్రి ఓ 8 అడుగుల మొసలి పక్కనే ఉన్న..

Viral: కారు అద్దాన్ని వైపర్‌తో తుడుస్తుంటే.. ఎదురుగా నల్లటి ఆకారం.. బాబోయ్.!
Viral Video
Follow us
Ravi Kiran

|

Updated on: Jul 01, 2024 | 9:00 PM

మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు నదులు, జలపాతాలన్నీ ఉప్పొంగుతున్నాయి. దీంతో అక్కడక్కడా జలచరాలు జనావాసాల్లోకి కొట్టుకొస్తున్నాయి. తాజాగా రత్నగిరి జిల్లాలోని తీరప్రాంతమైన చిప్లన్‌లోని చించ్ నాకా పరిసరాల్లో ఆదివారం రాత్రి ఓ 8 అడుగుల మొసలి పక్కనే ఉన్న నది నుంచి రోడ్డుపైకి కొట్టుకొచ్చింది. రోడ్డుపై వాహనాలు తిరుగుతున్నా ఏమాత్రం లెక్కచేయకుండా స్వేచ్ఛగా తిరుగుతూ హల్ చల్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. రోడ్డుపై మొసలి ఠీవీగా సంచరించడాన్ని చూసిన స్థానికులంతా భయాందోళనకు గురయ్యారు.

రత్నగిరి జిల్లాలో చిత్తడి నేలలో మొసళ్లు అధికంగా జీవిస్తున్నాయి. వాటిని మగ్గర్స్ అంటారు. జిల్లాలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో మొసళ్లకు ఆవాసంగా ఉన్న శివ నది నుంచి ఈ మొసలి కొట్టుకొచ్చి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. అయితే మొసళ్లు జనావాసంలోకి రాకుండా రక్షణ చర్యలు చేపట్టాలని తీర ప్రాంతవాసులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇటీవల యూపీలోని బులంద్ షహర్ లోనూ ఈ తరహా ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. అక్కడి గంగా నది కాలువ నుంచి ఓ 10 అడుగుల భారీ మొసలి బయటకు వచ్చింది. అధికారులు దాన్ని పట్టుకొనేందుకు ప్రయత్నించగా ఇనుపు రెయిలింగ్ మీద నుంచి దూకేందుకు ప్రయత్నించింది. చివరకు అధికారులు దాన్ని బంధించి తిరిగి నీటిలో విడిచిపెట్టారు.

గురువుకి రెట్టింపు బలం.. ఆ రాశుల వారికి కనక వర్షం పక్కా..!
గురువుకి రెట్టింపు బలం.. ఆ రాశుల వారికి కనక వర్షం పక్కా..!
మీరు డ్రైవింగ్‌లో అంబులెన్స్‌కు దారి ఇవ్వకుంటే ఏమవుతుందో తెలుసా?
మీరు డ్రైవింగ్‌లో అంబులెన్స్‌కు దారి ఇవ్వకుంటే ఏమవుతుందో తెలుసా?
ఇదో రకం పిచ్చి..! అగ్నిపర్వతం లావాతో సిగరెట్‌ వెలిగించుకోవాలని
ఇదో రకం పిచ్చి..! అగ్నిపర్వతం లావాతో సిగరెట్‌ వెలిగించుకోవాలని
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు