సోషల్ మీడియా అనేది మరో ప్రపంచం లాంటిది. ఎక్కడ ఏం జరిగిన అది క్షణాల్లో సోషల్ మీడియాలో ప్రత్యక్షం అవుతూ ఉంటుంది. జంతువులకు సంబంధించిన వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంటాయి. మాములుగా క్రూర మృగాలను చూస్తే భయంతో వణికిపోతాం.. కానీ ఒక చిన్నారి చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. చిరుతను ముద్దుగా చూసేందుకు ఓ అమ్మాయి ప్రయత్నించిన క్లిప్ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. ఈ వీడియోను @sumipatel42 ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో క్రేజీ వైరల్‌గా మారింది. ఇంతకు ఈ వీడియోలో ఏమున్నదంటే..
వైరల్ అవుతోన్న ఈ వీడియోలో ఒక చిన్న అమ్మాయి చేతులతో చిరుతను పట్టుకోవడానికి ప్రయత్నించిన వీడియో వైరల్ అవుతోంది. అయితే అది గర్జించడంతో కాస్త బయపడినప్పటికీ.. ఆమె దైర్యంగా చిరుతను పట్టుకోవడానికి ప్రయత్నించింది. అక్టోబర్ 29న షేర్ చేయబడినప్పటి నుంచి క్లిప్ 9.2 మిలియన్లకు పైగా వీక్షణలను సంపాదించింది. ఈ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి