ఈ వ్యక్తి మామూలోడు కాదబ్బా.! పడుకున్నట్టు నటిస్తూ.. రైల్వేస్టేషన్‌లో అర్ధరాత్రి ఏం చేశాడో చూస్తే..
రైల్వే స్టేషన్‌లో నిద్రపోతున్నట్లు నటిస్తూ ఒక వ్యక్తి చోరీలు చేశాడు. వెయిటింగ్ రూమ్‌లో నేలపై నిద్రిస్తున్న వారి పక్కనే పడుకుని దొంగతనాలకు పాల్పడ్డాడు. అక్కడి సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని మథుర రైల్వే స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది.

రైల్వే స్టేషన్‌లో నిద్రపోతున్నట్లు నటిస్తూ ఒక వ్యక్తి చోరీలు చేశాడు. వెయిటింగ్ రూమ్‌లో నేలపై నిద్రిస్తున్న వారి పక్కనే పడుకుని దొంగతనాలకు పాల్పడ్డాడు. అక్కడి సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని మథుర రైల్వే స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది. ఆ రైల్వే స్టేషన్‌లో పలు దొంగతనాలు జరుగుతున్నట్లు ప్రభుత్వ రైల్వే పోలీసులకు కొందరు ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. దీంతో సీసీటీవీ ఫుటేజ్‌ను వారు పరిశీలించారు. ఒక వ్యక్తి నిద్రపోతున్నట్లు నటిస్తూ పలు చోరీలకు పాల్పడటం సీసీ ఫుటెజ్‌లో చూసి అధికారులు అవాక్కయ్యారు.
తొలుత ఒక ప్రయాణికుడి పక్కన అతడు పడుకొన్నాడు. తనను ఎవరైనా గమనిస్తున్నారేమోనని లేచి చూశాడు. తిరిగి పడుకొన్నాడు. మెల్లగా నిద్రిస్తున్న ప్రయాణికుడి ప్యాంట్ జేబులోని మొబైల్ ఫోన్ దొంగిలించాడు. ఆ తర్వాత సమీపంలోని మరో ప్రయాణికుడి పక్కన పడుకున్నాడు. అతడి ప్యాంటు జేబులోని మొబైల్ ఫోన్ చోరీ చేశాడు. అనంతరం ఆ వెయిటింగ్ రూమ్ నుంచి జారుకున్నాడు. సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన రైల్వే పోలీసులు చివరకు ఆ దొంగను గుర్తించారు. నిద్రపోతున్నట్లు నటిస్తూ చోరీలు చేస్తున్న ఎటా జిల్లాకు చెందిన 21 ఏళ్ల అవినీష్ సింగ్‌ను మంగళవారం అరెస్ట్ చేశారు. ఐదు మొబైల్ ఫోన్లు చోరీ చేసినట్లు తెలుసుకున్నారు. అతడి నుంచి ఒక దానిని స్వాధీనం చేసుకున్నారు. మిగతా మొబైల్ ఫోన్లు, ఇతర వస్తువుల స్వాధీనం కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
रेल्वे स्टेशनवरील Sleeping चोर कॅमेरात कैद! चोरीची पद्धत पाहून पोलिसही थक्क; पाहा Videohttps://t.co/Fzppurm5u3 < येथे वाचा सविस्तर वृत्त…#SleepingThief #uttarpradeshnews #uttarpradesh #Mathura #CCTV #Railway #RailwayStation #IndianRailway pic.twitter.com/aFQWGO8gqV
— ZEE २४ तास (@zee24taasnews) April 11, 2024
